ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం మరింత రంజుగా మార బోతుందా అంటే, అవును అనే సమాధానం వస్తుంది. జగన్ పార్టీలో నెంబర్ 2 అయిన, విజయసాయి రెడ్డి లీలలు తొందర్లోనే బయట పెడతాను అంటూ, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసాయి. నెల రోజుల క్రితం, ఏబీఎన్ ఛానల్ లో వచ్చే, వీకెండ్ కామెంట్ బై ఆర్కేలో, రాధాకృష్ణ తనకు తెలిసిన ఒక వార్త చెప్పుకొచ్చారు. జగన్ మోహన్ రెడ్డి చెల్లి, షర్మిల తొందర్లోనే పార్టీ పెట్టబోతున్నారని చెప్పారు. అంతే కాదు, షర్మిలకు, జగన్ కు మధ్య గ్యాప్ వచ్చింది, వైఎస్ విజయమ్మ ఎంత ప్రయత్నం చేసినా వర్క్ అవుట్ అవ్వలేదని, వైఎస్ ని తిట్టినవాళ్ళకు కూడా మంత్రి పదవులు ఇచ్చి, చివరకు పార్టీ కోసం కష్టపడిన తనకు ఎలాంటి అవకాసం ఇవ్వటం లేదనే ఆలోచనలో షర్మిల ఉన్నారని, అందుకే పార్టీ పెడుతున్నారు అంటూ ఆర్కే చెప్పుకొచ్చారు. అయితే అప్పట్లో రాధాకృష్ణ పై అందరూ విరుచుకు పడ్డారు. రాధాకృష్ణ ఇలాగే చెప్తారు అంటూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీసి పడేశాయి. షర్మిల నుంచి ఒక ఖండన అయితే ఇప్పించారు కానీ, ఎక్కడా ఆవిడ పార్టీ పెట్టటం లేదు అని మాత్రం చెప్పలేదు. అయితే రాధాకృష్ణ చెప్పినట్టే డేట్ తో సహా, అదే రోజు షర్మిల పార్టీ పెట్టటం పై కసరత్తు ప్రారంభించారు. అంతే కాదు, ఆమె స్వయంగా ప్రెస్ తో కూడా ఈ విషయం చెప్పారు.

rk 14022021 2

దీంతో ఉన్నట్టు ఉండి రాధాకృష్ణ క్రెడిబిలిటీ తారా స్థాయికి చేరుకుంది. రాధాకృష్ణ మాట తీసిపారేసిన వారందరూ ఇప్పుడు నమ్ముతున్నారు. అయితే ఇదే విషయం పై విజయసాయి రెడ్డిని మీడియా ప్రశ్నించగా, రాధాకృష్ణకు రాత్రి కలలో ఏవో వస్తూ ఉంటాయని, ఆ వచ్చిన కలను ఉదయం తన పేపర్ లో రాసుకుని, మనకు వినిపిస్తారు అంటూ, విజయసాయి ఎద్దేవా చేసారు. అయితే, విజయసాయి ఎగతాళికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు రాధాకృష్ణ. నిన్న జరిగిన వీకెండ్ కామెంట్ బై ఆర్కే లో, విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. అవును నాకు, షర్మిల పార్టీ పెడుతున్నట్టు కల వచ్చింది, అయితే ఇప్పుడు ఆ కల నిమైంది కదా. అలాగే విజయసాయి రెడ్డి లీలలు గురించి కూడా నాకు కొన్ని కలలు వచ్చాయి. తొందర్లోనే ఆ లీలలు అందరికీ తెలుస్తాయి. ఆ లీలలు తెలుసుకోవటానికి విజయసాయి రెడ్డి కూడా సిద్ధంగా ఉండాలి అంటూ, రాధాకృష్ణ కౌంటర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు విజయసాయి లీలలు ఏమిటి ? అసలు ఆర్కే ఏమి చెప్తారు అనేది సస్పెన్స్ గా మారింది. అయితే ఇప్పటి వరకు విజయసాయి రెడ్డి, ఆర్కే చేసిన కామెంట్ పై స్పందించలేదు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read