మావోయిస్టు అగ్రనేత ఆర్కే మరణాన్ని మావోయిస్టులు ధ్రువీకరించారు. 1958లో గుంటూరు జిల్లా పల్నాడులో జన్మించిన ఆర్కే, ఈనెల 14 ఆర్కే(63) మృతి చెందినట్టు మావోయిస్టులు ప్రకటించారు. కిడ్నీలు విఫలమై ఆర్కే మరణించినట్టు చెప్పారు. పార్టీ శ్రేణుల సమక్షంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేశాం అని తెలిపారు. డయాలసిస్ కూడా చేసాం అని అయినా కాపాడుకోలేక పోయాం అని తెలిపారు. చికిత్స అందించిన ఆర్కేను కాపాడుకోలేపోయాం అని ఆ ప్రకటనలో తెలిపారు. అయితే ఆర్కే మృతిపై కొత్త విషయం బయట పడింది. ఆర్కే మరణం వెనుక ఛత్తీస్గఢ్ పోలీసుల వ్యూహం ఉన్నట్టు తెలుస్తుంది. ఆర్కే అనారోగ్యంపై పోలీసులకు స్పష్టమైన సమాచారం ఉండటంతో, ఆపరేషన్ సమాధాన్ ను మొదలు పెట్టారు. ఆ ఆపరేషన్ తోనే పోలీసులు టార్గెట్ పూర్తి చేసారు. వారం నుంచి అడవిని చుట్టుముట్టి ఆపరేషన్ సమాధాన్ అమలు చేసారు. వైద్యం అందకుండా చేసే ప్రయత్నంలో పోలీసులు సఫలం అయ్యారు. ఆపరేషన్ సమాధాన్ విజయవంతమైందంటున్న పోలీసుల ప్రచారం, దీనికి సాక్ష్యం అని అంటున్నారు. ఆర్కే భార్య శిరీష కూడా ఇదే ఆరోపణ చేసారు. వైద్యం అందకుండా పోలీసులు చంపేశారని, పోలీసుల నిర్బంధం లేకుంటే బతికేవాడని, ఆమె అన్నారు.
ఆర్కే మరణంపై ట్విస్ట్.. కొత్త విషయాలు బయటకు...
Advertisements