జగన్ ప్రభుత్వానికి, రోజుకి ఒకసారి అయినా, అటు కేంద్రం నుంచి కాని, ఇటు కోర్ట్ ల నుంచి కాని ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది. చంద్రబాబుని ఇరికించటానికి, చంద్రబాబు హయంలో చేసిన విద్యుత్ ఒప్పందాల్లో పెద్ద స్కాం జరిగింది అని తెలియ చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి, జూలై 25న, ఆరు పేజీల లేఖతో, ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. అధిక ధరలకు చంద్రబాబు ఒప్పందాలు చేసుకున్నారు అంటూ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసారు. అయితే ఇక్కడ చంద్రబాబుని, కేంద్రం ఇబ్బంది పెడుతుందని ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు అది తనకే రివర్స్ అయ్యింది. ఆ లేఖ పై సమాధానం ఇస్తూ, మీ ఫిర్యాదు తప్పు అంటూ ఝలక్ ఇచ్చారు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్. విద్యుత్ పీపీఏల ఒప్పందాల్లో గతంలో, ఎలాంటి అవినీతి జరగలేదని కేంద్రం తరుపున తేల్చి చెప్పారు కేంద్ర మంత్రి ఆర్కే సింగ్. అన్ని వివరాలు తెలియచేస్తూ, జగన్‌కు కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ లేఖ రాశారు.

jagan 25092019 1 2

గతంలో చంద్రబాబు పై, ఆరు పేజీల లేఖతో, జగన్, ప్రధానికి చేసిన ఫిర్యాదు పై, కేంద్ర మంత్రి స్పందిస్తూ, బదులు లేఖ రాసారు. రాష్ట్రంలో డిస్కంల నష్టానికి, అప్పట్లో చేసుకున్న ఒప్పందం ప్రకారం, అధిక రేట్లు కారణం అంటూ జగన్ చేసిన వాదనను, కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కొట్టి పడేసారు. డిస్కింల నష్టానికి, ఈ ఒప్పందాలకు సంబంధం లేదని, డిస్కింల నష్టానికి వేరే కారణాలు ఉన్నాయని, దీనికి ముడి పెట్టవద్దు అంటూ ఆయన స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రేట్లు కంటే, దేశంలోని ఐదు రాష్ట్రాల్లో పీపీఏలకు ఇంతకంటే ఎక్కువ రెట్లు చెల్లిస్తున్నారని అయన లేఖలో వివరాలు వెల్లడించారు. పీపీఏల టారిఫ్‌ల నిర్ణయం గాలివేగం, సౌర, థార్మికత, ప్లాంట్ సామర్థ్యం పై ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు.

jagan 25092019 1 3

చంద్రబాబు ప్రభుత్వంలో ఉండగా, మూడు కంపెనీలకే 70 శాతం కేటాయింపులు చేశారంటూ మీరు చెప్పిన దాంట్లో, నిజం లేదని ఆయన చెప్పారు. కొన్ని కంపెనీలు మిగతా కంపెనీలను టేకోవర్ చేయడం వల్లే విద్యుత్ ఉత్పాదకత పెంచుకున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం థర్మల్ పవర్ రూ.4.20 పైసలకే వస్తోందని, కానీ రాను రాను బొగ్గు నిల్వలు తగ్గిపోతాని, 20 సంవత్సరాల తర్వాత యూనిట్ ధర రూ.22 అవుతుందని అన్నారు. కాని పవన్ విద్యుత్ ఎప్పుడూ రూ.4.80కే లభిస్తుందని, అందుకే మన దేశం వాటికి ఎక్కవు ప్రాముఖ్యత ఇస్తుందని అన్నారు. పీపీఏలపై పునఃసమీక్ష చేస్తే, గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టె వారికి, తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేంద్ర మంత్రి ఆర్కేసింగ్ తన లేఖలో పేర్కొన్నారు. మరి ఇప్పటికైనా జగన్, తన నిర్ణయాన్ని మార్చుకుంటారో లేదో చూడాలి. నిన్నే హై కోర్ట్ కూడా, ప్రభుత్వం ఇచ్చిన జీవో కొట్టేసిన సంగతి తెలిసిందే.

Advertisements

Advertisements

Latest Articles

Most Read