కేంద్ర ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వనికి బయటకు సఖ్యతగా ఉన్నట్టు కనిపిస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం, కేంద్రం నుంచి ఏ చిన్న సహకారం కూడా రావటం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులతో, కేంద్రం ఎన్ని అభ్యంతరాలు చెప్పినా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, ఇష్టం వచ్చినట్టు చెయ్యటమే కారణంగా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. చివరకు స్టీఫెన్ రవీంద్ర, శ్రీలక్ష్మి లాంటి ఆఫీసర్ల డిప్యుటేషన్ కు కూడా కేంద్రం ఒప్పుకోలేదు. ఇక పోలవరంతో పాటు, విద్యుత్ పీపీఏల విషయంలో అయితే సరే సరి. విద్యుత్ పీపీఏల విషయంలో, కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య ఒక చిన్న సైజు యుద్ధమే నడుస్తుంది. కేంద్రం నుంచి జగన్ ప్రభుత్వానికి, ఎన్నో లేఖలు వచ్చాయి. అయినా జగన్ ప్రభుత్వం మాత్రం మొండిగా ముందుకు వెళ్లి, ఇప్పుడు కరెంటు కూతలకు కారణం అయ్యింది. ఈ నేపధ్యంలో, కేంద్రం నుంచి జగన్ కు మరో ఘాటు లేఖ వచ్చింది.

rksingh 05102019 2

ఈ ఆర్ధిక సంవత్సరం, డిస్కంల నష్టాలు భారీగా పెరిగిపోయాయని, ఇలాగే కొనసాగితే చాలా కష్టం అంటూ, జగన్ కు, కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కేసింగ్ లేఖ రాసారు. ఒక పక్క జగన్ ప్రభుత్వం, చంద్రబాబు వల్లే నష్టాలు అని చెప్తుంటే, గడిచిన ఆరు నెలల్లో, నష్టాలు అధికంగా పెరిగిపోయాయని కేంద్ర మంత్రి లేఖ రాయటంతో, వైసీపీ డిఫెన్సు లో పడింది అనే చెప్పాలి. ఎందుకంటే ఏప్రిల్, మే నెలలో, ఇప్పటి చీఫ్ సెక్రటరీ పాలనలో రాష్ట్రం ఉంది, గడిచిన నాలుగు నెలలు, జగన్ ఉన్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర డిస్కంల వార్షిక నష్టాలు రూ. 1, 563 కోట్లకు వెళ్లాయని, ఇది 2018తో పోలిస్తే ఎక్కువుగా ఉందని, కేంద్ర మంత్రి లేఖలో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వశాఖలు, పట్టణ స్థానిక సంస్థల నుంచి డిస్కంలకు రావాల్సిన బకాయిలు రూ. 5, 542 కోట్ల రూపాయలకు చేరాయని, వాటిని వెంటనే చెల్లించాలని కోరారు.

rksingh 05102019 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రవేశ పెట్టిన ఉదయ్ పథకంలో భాగస్వామిగా ఉందని, డిస్కంల పనితీరును సమీక్ష చేసినప్పుడు, అవి రోజు రోజుకూ దిగజారుతున్నట్టుగా తేలిందని, కేంద్ర మంత్రి లేఖలో తెలిపారు. ప్రస్తుతం దిస్కంల నిర్వహణతో పాటుగా, ఆర్థికపరంగా కూడా వీటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. డిస్కంల పరిస్థితి ఇలానే కొనసాగితే, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆర్కే సింగ్ లేఖలో హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని వాటిని చక్కదిద్దాలని, ఆర్కే సింగ్ కోరారు. ఇప్పటికే విద్యుత్ విషయంలో, కేంద్రం, రాష్ట్రం మధ్య యుద్ధం జరుగుతున్న వేళ, ఇప్పుడు దిస్కంల బాకీల పై, కేంద్రం మంత్రి హెచ్చరిక, రేపు ఎటు దారి తీస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read