జగన్ మోహన్ రెడ్డి, ప్రమాణ స్వీకారం చేసిన రోజే, ఆంధ్రజ్యోతి, టీవీ5 లను, పేర్లు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు. నా పై వ్యతిరేక వార్తలు రాస్తే, కోర్ట్ కి ఈడుస్తా అని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు, పది రోజుల క్రిందట దీనికి సంబంధించి, క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎవరైనా , ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు రాస్తే, వారి పై కోర్ట్ కు వెళ్ళాలని , సంబంధిత శాఖలను ఆదేశించారు. అయితే, ఇప్పుడు ఆంధ్రజ్యోతి మరింత దూకుడుగా జగన్ పై కధనాలు రాస్తుంది. మరి ఇవి నిజంగా తప్పు ఉంటే, అవి తప్పుడు కధనాలు అయితే, జగన్ కోర్ట్ కు వెళ్తారా ? వైసీపీ శ్రేణులు మాత్రం, నిన్న ఏబిఎన్ లో, ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కధనం పై, కోర్ట్ కు వెళ్ళాల్సిందే అని పట్టుబడుతున్నారు. మరి, జగన్ ఆ నిర్ణయం తీసుకోగలరా ? ఇప్పటికే ఏబీఎన్ ని కేబుల్, ఫైబర్ లో బ్యాన్ చేసి, టీడీసాట్ చేత ఏపి ప్రభుత్వం చీవాట్లు తింది. ఇలాంటి సందర్భంలో, జగన్ మీద ఇంత డేరింగ్ కధనాలు వేస్తున్న రాధాకృష్ణ పై, జగన్ కు ఆక్షన్ తీసుకునే చాన్స్ ఉందా అనే చర్చ జరుగుతుంది.

jagan 27102019 2

ప్రతి శనివారం ఎబిఎన్ లో, వచ్చే వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. అయితే, ఈ వీకెండ్ కామెంట్ లో, కేసిఆర్ కు, జగన్ పై ఉన్న అభిప్రాయం ఇది అంటూ, ఆర్కే చెప్పుకొచ్చారు. తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ తన ఆంతరంగికులతో జరిపిన సమావేశంలో, జగన్ కు చాలా తక్కువ భవిష్యత్తు ఉందని, త్వరలోనే జగన్ సీన్ అయిపోతుందని, మరో ఆరు నెలల తరువాత ఎప్పుడైనా, జగన్ కు జైలు తప్పదని, తన వద్ద దానికి సంబంధించి స్పష్టమైన సమాధానం ఉందని చెప్పారని, ఆర్కే చెప్పారు. సిబిఐ చార్జిషీట్ల పై, త్వరలోనే రోజు వారీ విచారణ ప్రారంభం అవుతుందని, అదే కనుక జరిగితే, అప్పుడు సిబిఐ, జగన్ బెయిల్ రద్దు చేయమని కోరుతుందని, అప్పుడు కోర్ట్ రద్దు చేసే అవకాశాలు ఉన్నాయని, కేసిఆర్ తన సన్నిహితుల వద్ద చెప్పారంట..

jagan 27102019 3

బెయిల్ కనుక రద్దు అయితే, జగన్ మోహన్ రెడ్డి రాజీనామా చేయక తప్పని పరిస్థితి వస్తుందని, కేసీఆర్ అభిప్రాయ పడ్డారట. ఇటీవల జగన్ మోహన్ రెడ్డి, ప్రగతి భవన్ కు వచ్చి, కేసీఆర్ ని కలసిన సందర్భంలో, ఈ అంశం ప్రస్తావనకు వచ్చిందని, బెయిల్‌ రద్దు కాకుండా మార్గాలు ఏమైనా ఉన్నాయా? అని ఒక ప్రముఖ న్యాయవాదితో తాము ఇద్దరం చర్చలు జరిపమాని కేసిఆర్ చెప్పినట్టు చెప్తున్నారు. అయితే ఆ న్యాయవాది మాత్రం, మొత్తం సిబిఐ చేతిలో ఉందని, సిబిఐ బెయిల్ రద్దు చెయ్యాల్సిందే అని గట్టిగా పట్టుబడితే, కోర్ట్ దానికే అంగీకరిస్తుందని చెప్పారట. అందుకే జగన్ మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు లేక పోయినా, అన్ని పధకాలు వెంట వెంటనే ప్రారంభిస్తూ, లబ్దిదారులకు చేరక పోయినా, ప్రచారం చేసుకుంటున్నారని, కేసీఆర్ అభిప్రాయ పడ్డారట. అయితే ఇంత ఓపెన్ గా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మధ్య జరిగిన విషయాన్ని ఆర్కే బయట పెట్టరు. ఇది అబద్ధం అయితే, మరి జగన్ గారు కేసు పెడతారా ? ఆర్కే ని కోర్ట్ కు ఈడవగలరా ? చూద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read