గత శనివారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ లో, ఆ ఛానల్ ఎంపీ రాధాకృష్ణ ఇచ్చిన వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చకు దారి తీసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఇద్దరూ కలిసి, క-రో-నా ని ఎంత తేలికగా తీసి పడేసారు, క-రో-నా పై ఎంత సీరియస్ గా ఉన్నారో చెప్తూ, తన వీకెండ్ కామెంట్ లో వివరించారు. ముందుగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చెప్తూ, ఆయన క-రో-నా విషయంలో మొదట్లో అసెంబ్లీలో జరిగిన విషయం గురించి ప్రస్తావిస్తూ, ఆయన ఎంత లైట్ తీసుకున్నారో చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తూ జగన్ మోహన్ రెడ్డి గురించి చెప్పుకొచ్చారు. గత ఏడాది మార్చి 25న జగన్ మోహన్ రెడ్డి , అధికారులతో జరిగిన సమవేశంలో, క-రో-నా గురించి మాట్లాడిన విషయం చెప్తూ, అందరినీ షాక్ కు గురి చేసారు. జగన్ మోహన్ రెడ్డికి, అధికారులు క-రో-నా తీవ్రత చెప్తూ ఉండగా, జగన్ కలుగు చేసుకుని, నేను రాత్రి జీసస్ తో మాట్లాడానని, ఆయన క-రో-నా వైరస్ లాంటిది ఏమి లేదని చెప్పారని, చెప్పినట్టు ఆర్కే చెప్పారు. అంతే కాదు మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అనుభవం చెప్తూ, ఒకసారి జగన్ మోహన్ రెడ్డి, రాత్రి 12 గంటలకు తన తండ్రి వైఎస్ఆర్ తో కూడా మాట్లాడారని చెప్పారని, ఆ అధికారి చెప్పినట్టు రాధాకృష్ణ చెప్పుకొచ్చారు.
అయితే ఈ కధనం ప్రకంపనలు రేపింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతే కాదు, ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ లు, ప్రతీకారాలు తీర్చుకుంటున్న పరిస్థితిలో, ఏ ఆధారం లేకుండా, రాధాకృష్ణ ఇంత ధైర్యంగా ఈ విషయం ఒక టీవీ ఛానల్ లో చెప్పే అవకాసం లేదు. గతంలో రఘురామకృష్ణం రాజు చేసిన వ్యాఖ్యలకు ఆయన్ను అరెస్ట్ చేసారు కూడా. అయితే ఇప్పుడు రాధాకృష్ణ పరిస్థితి ఏమిటి అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ అంశం వైరల్ అవ్వటంతో, జగన్ మోహన్ రెడ్డి ఈ విషయం పై పరోక్షంగా స్పందించారు. ఒక పక్క హాస్పిటల్ లో ఖాళీలు ఉంటే, ఇప్పుడు ఆక్సిజన్ లేక మరణించారు అంటూ కధనాలు రాసారని జగన్ అన్నారు. అలాగే క-రో-నా ని చులకన చేసి మాట్లాడాను అంటూ, నిస్సుగ్గుగా రాతలు రాసారని, విలువులు లేకుండా ఇలా వార్తలు ఎలా రాస్తారని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి ఉన్న స్థాయి దిగజార్చే విధంగా కధనాలు ఉన్నాయని జగన్ అన్నారు. అయితే ఆ కధనం పై, చట్ట ప్రకారం, న్యాయప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు జగన్ కు చెప్పారు.