వైసీపీలో మంత్రి రోజా ఒంటరైందా అంటే అవుననే పరిస్థితులు నిరూపిస్తున్నాయి. నగరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర సభలో మంత్రి రోజాపై ఒక తుఫానులా విరుచుకుపడిన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపణలు గుప్పించారు. విమర్శల బాణాలు సంధించారు. అయితే వైసీపీ నుంచి రోజాని వెనకేసుకొస్తూ ఎవ్వరూ ఆమెకి మద్దతుగా నిలవలేదు. ఆమెపై లోకేష్ ఆరోపణలు చేస్తే ఆమే మీడియా ముందుకొచ్చి ఖండించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. డైమండ్ పాప అంటే ఫీలవుతోందని, జబర్దస్త్ ఆంటీ అంటున్నానని చెప్పారు లోకేష్. రోజా భర్త, అన్నలు నగరి నియోజకవర్గాన్ని వాటాలు వేసుకుని మరీ దోచుకుంటున్నారని ఆరోపించారు. రోజా అవినీతి, ఆరోపణలు, విదేశీ టూర్లు, మంత్రిగా అహంకారం మొత్తం కడిగి పారేశారు. తనపై ఈ స్థాయిలో నారా లోకేష్ విరుచుపడతాడని ఊహించని రోజా షాక్‌లోకి వెళ్లింది. వైసీపీ నుంచి ఎవరైనా తనకు మద్దతు వస్తారేమోనని ఎదురుచూసింది. ఎవ్వరూ రాకపోయేసరికి తానే ఆస్థాన మీడియా విద్వాంసులు సాక్షి వాళ్లని పిలిచి తనదైన మొరటు భాషలో కౌంటర్ ఇచ్చింది. మంత్రి రోజా వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఒక రేంజులో ఫైరయ్యారు. మరోవైపు రోజాకి ఇస్తామంటూ చీరలు, గాజులు పట్టుకుని వచ్చిన తెలుగు మహిళలు మంత్రి ఇంటిలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు మహిళలను అరెస్టుచేసి స్టేషన్‌కి తరలించారు. తమ నాయకుడు నారా లోకేష్ గురించి అనవసరంగా మాట్లాడితే రోజాను ఎక్కడికక్కడ నిలదీస్తామని తెలుగు మహిళలు హెచ్చరించారు. మంత్రిగా ఉన్న రోజాని లక్ష్యంగా చేసుకుని మరీ నారా లోకేష్ నగరిలో ప్రసంగించారు. అయితే ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీ నుంచి రోజాకి సంఘీభావం తెలపలేదు. తనపై ఆరోపణలకు చివరికి తానే వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి రోజాకి దాపురించింది. మరోవైపు లోకేష్ పై రోజా విమర్శల దాడికి దిగిన వెంటనే టిడిపి నేతలు, కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో రోజా అవాక్కయ్యారు.
లోకేష్ దెబ్బకు, వైసీపీలో ఒంటరైన రోజా..,.
Advertisements