అందరి పై విరుచుకుపడే రోజా, తనను ఎవరూ పట్టించుకోవటం లేదు అంటూ, కన్నీళ్లు పెట్టుకోవటం ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. అందరికీ ప్రత్యర్ధి పార్టీల నుంచి ఇబ్బందులు ఉంటే, నాకు మాత్రం సొంత పార్టీ నేతల నుంచే ఇబ్బందులు ఉన్నాయని వాపోయారు. ఈ రోజు తిరుపతిలో అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రివిలేజ్ కమిటీ చైర్మెన్ గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో తెలుగుదేశం నేతల పై ఇచ్చిన ఫిర్యాదులను కమిటీ పరిశీలించింది. అయితే ఇదే సమావేశానికి రోజా కూడా హాజరు అయ్యి, తన ఎమ్మెల్యే పదవికి అవమానం జరుగుతుంది అంటూ, ప్రివిలేజ్ కమిటీ ముందు ఫిర్యాదు చేసారు. అధికారులు ఎవరూ తనను ఎమ్మెల్యేగా చూడటం లేదని వాపోయారు. నిబంధనులు పాటించకుండా, కనీస ప్రోటోకాల్ పాటించకుండా, తనను ఇబ్బంది పెడుతున్నారని రోజా ఆరోపణ. ప్రధానంగా ఈ సమస్యలు చెప్తూ రోజా కన్నీరు పెట్టుకుంటున్నారు అంటూ, వార్తలు రావటంతో, రోజా సొంత పార్టీలో పడుతున్న ఇబ్బందులు పై ఇప్పుడు చర్చ జరుగుతుంది. సహజంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ గ్రూపులు ఎక్కువ. మొత్తం పెద్దిరెడ్డి చెప్పినట్టు జరగాల్సిందే. ఇక మరో పక్క ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కూడా ఉన్నారు.

roja 18012021 2

ఇలా వీరి అందరి మధ్య రోజా ఇబ్బందులు పడుతుందా అనే చర్చ జరుగుతుంది. ప్రివిలేజ్ కమిటీ మీటింగ్ లో, ఆమె కన్నీటి పర్యంతం అయ్యారని, మహిళా ఎమ్మెల్యేని కావాలని ఏడిపిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేయటం జరిగింది. ఆమె ప్రధానంగా ప్రోటోకాల్ విషయంలో ఫిర్యాదు చేసారు. తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అధికారులు తనను పిలవటం లేదని కలెక్టర్ పై ఫిర్యాదు చేసారు. ఇక దీనితో పాటు, సొంత పార్టీ నేతలు, మంత్రులు కూడా తనను ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఫిర్యాదు చేసారు. టిటిడిలో పని చేసే ఉద్యోగులుకు, తన నియోజకవర్గంలో ఉన్న ఏపీపీఐసి ల్యాండ్ ని ఇళ్ళ స్థలాలుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని, అయితే దాని కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా తనను పిలవలేదని ఆమె అవేదన వ్యక్తం చేసారు. ఎమ్మెల్యేగా కాకపోయినా, ఏపీపీఐసి చైర్మెన్ హోదాలో కూడా తనని పిలవలేదని అన్నారు. అయితే అన్ని అంశాలు పరిశీలించిన కాకాని, సియం జగన్ దృష్టికి తీసుకుని వెళ్తామని, కలెక్టర్ తో మాట్లాడామని, ఇక ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read