మొన్నా మధ్య నారా - హమారా మీటింగ్ లో, చంద్రబాబు మాటలను మార్ఫింగ్ చేసి, కట్, పేస్టు చేసి, ఆయన అనని మాటలు, అన్నట్టు, ఎలా ప్రచారం చేసారో చూసాం. సాక్షి పత్రిక ముసుగులో, వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇలా ఉంటాయి. అయితే, ఈ రోజు ఇలాంటి పనే చేసింది, జగన్ ప్రియ శిష్యురాలు రోజా.. తన అన్న, జగన్ మోహన్ రెడ్డి పేరు నిలబెడుతూ, అసెంబ్లీ వీడియోనే సగం వరకు కట్ చేసి, కావాల్సింది తీసుకుని తప్పుడు ప్రచారం చేసింది రోజా.. అసెంబ్లీకి వచ్చి, అక్కడ ప్రజా సమస్యలు గురించి పట్టించుకోని వైసిపీ, అక్కడ జరిగే విషయాలు మాత్రం, తీసుకుని, వారికి కావలసిన విష ప్రచారం చేస్తున్నారు.
ఇదే కోవలో, మంత్రి పరిటాల సునీత, డ్వాక్రా రుణాల గురించి అడిగిన ప్రశ్నకు, చెప్పిన సమాధానం తీసుకుని, విష ప్రచారం చేస్తూ ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది రోజా. ఇది తీసుకుని సాక్షి కూడా తన టీవీలో వేసింది. అసలు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు, ఒక్క రూపాయి కూడా సహయం చెయ్యలేదు అని, అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అంటూ, ప్రచారం మొదలు పెట్టారు. ఈ ప్రచారం పై మంత్రి పరిటాల సునీత సీరియస్ అయ్యారు. వెంటనే, గంటలోపే వివరణ ఇచ్చారు. "డ్వాక్రా ఋణాల రద్దుపై అసెంబ్లీలో ఇచ్చిన సమాదానాన్ని వక్రీకరించి సాక్షి ఛానల్ లో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. DWCRA రుణాల రద్దు విషయంలో ప్రభుత్వం ఒక కమిటిని నియమించి ప్రతి DWCRA మహిళకు రూ. 10,000/- లను పసుపు కుంకుమ గా ఇచ్చినట్లయితే అందరికి సమానంగా లబ్ది చేకూరుతుందని నిర్ణయించినది."
" నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వము 86,04,304 లక్షల మందికి రూ. 10,000/- చొప్పున మంజూరు చేయటం జరిగింది. ఇప్పటికే రూ.6,883.44 కోట్లు 3 విడతలలో వారి సంఘం పొదుపు ఖాతాలకు వెయ్యటం జరిగింది. దీనికి తోడు ఆ 15 నెలల వడ్డీ రూ. 1,338 కోట్లు (ఫిబ్రవరి 2014 నుండి ఏప్రిల్ 2015 వరకు) కూడా గ్రూపులకు అందించటం జరిగింది. ఆ తరువాత కాలానికి కూడా వడ్డీ రాయితీ క్రింద రూ.1,176 కోట్లు ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పటి వరకు ప్రభుత్వము తరపున మహిళలకు 9,397.44 కోట్లు ఆయా సంఘాల ఖాతాలకు జమ చేయటం జరిగింది. సాక్షి పత్రిక మరియు శ్రీమతి రోజా DWCRA మహిళలకు ఏ సహాయం అందలేదని అసత్య ప్రచారానికి పూనుకోవటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.ప్రతి సంవత్సరం 98% రికవరీ తో ఇప్పటి వరకు రూ. 51,745 కోట్లు బ్యాంకు రుణాలను వడ్డీ రాయితి తో ఇవ్వటం జరిగింది. శ్రీమతి రోజా చేసిన అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని గ్రహించాలి." అంటూ మంత్రి పరిటాల సునీత ప్రజలకు వివరణ ఇచ్చారు.