తిరుమల అంటే ప్రతి ఒక్కరకీ ఎంతో పవిత్రమైన స్థలం... ఆ వెంకన్నను దర్శించుకుని, జీవితంలో ముందుకు పోతూ ఉంటాం... అలాంటి తిరుమలని అప్రతిష్టపాలు చెయ్యటం ప్రారంభించిన వైఎస్ఆర్ దగ్గర నుంచి ఆయన వారసుడు జగన్ తో పాటు, ఆయన పార్టీ నాయకులు కూడా, తిరుమల వచ్చిన ప్రతి సారి, ఎదో ఒక రచ్చ చేసి కాని వెళ్ళరు... అర్ధం కానిది ఏంటి అంటే, ఏ రొజూ టిటిడి అధికారులు వీరిని అడ్డుకోరు.. పది రోజుల క్రితం రచ్చ రచ్చ చేసిన రోజా, ఇవాళ కూడా తిరుమల వెళ్లి మళ్ళీ అదే రచ్చ చేసారు...
పోయిన సారి విషయాలు గుర్తు చేసుకుంటూ, దర్శనం చేసుకుని బయటకు వచ్చి, ఆడు ఎవడు, ఈడు ఎవడు, ఎవడెవడో అంటూ మాట్లాడుతూ, నేను చెప్పినట్టు చెయ్యాల్సిందే అంటూ, టిటిడి అధికారులు చంద్రబాబు తొత్తులు అంటూ, హడావిడి చేస్తూ, రాజకీయ ప్రసంగాలు చేస్తూ, వెంకన్న సన్నిధిని కూడా రాజకీయ వేదికలకు వాడుకుంటున్నారు.. అసలు తిరుమల వచ్చిన ప్రతి సారి రోజా ఎందుకు ఇలా చేస్తున్నారు ? ఒకసారి అంటే నిజంగా ఎమన్నా ఇబ్బంది ఉంది అనుకోవచ్చు, వచ్చిన ప్రతి సారి, తిరుమలలో ఈ రచ్చ ప్లాన్ చేస్తున్నారు అంటే, ఇలా రచ్చ చేసి, జగన దగ్గర మార్కులు కొట్టెయ్యాలి అనా ? ఎందుకంటే జగన్ కూడా ఇదే మైండ్ సెట్ కదా... తిరుమలలో చెప్పులు వేసుకుని తిరగటం, నాకు దేవుడు మీద నమ్మకం అని ఒక్క సంతకం కూడా పెట్టక పోవటం...
ఇదే రకమైన వైఖరితో రోజా పది రోజుల క్రిందటే రెచ్చిపోయారు.... తనతో పాటు 50 మందిని దర్శనానికి తీసుకువెళ్ళింది రోజా.. అందరకీ ఎల్ 1 టిక్కెట్లపై (వీఐపీ టిక్కెట్లు) కేటాయించాలి అని రచ్చ చేసింది... ఎమ్మెల్యేగా ఉన్న తనకు ఎల్ 1 టిక్కెట్ కేటాయించకుండా అధికారులు అవమానించారంటూ హడావిడి చేసింది... ఆలయం ఎదుట రోజా అనుచరులు హడావుడి చేశారు. నానా హంగామా చేస్తూ, భక్తులని ఇబ్బంది పెట్టారు... వాహనాలపై నిలబడి ఊరేగుతూ కనిపించారు.... పది రోజుల తరువాత కూడా అదే తంతు.. వీరిని ఆ వెంకన్నే మార్చాలి...