జగన్ పార్టీ ఫేవరేట్ ఎమ్మెల్యే రోజా, నంద్యాల, కాకినాడ ఎన్నికలు తరువాత పూర్తిగా మీడియా ముందుకు రావటం, బూతులు మాట్లాడటం ఆపేశారు... ఎక్కడా హడావిడి చెయ్యకుండా, తన నియోజకవర్గానికే పరిమితం అయిపోయారు...
ఇవాళ రోజా సడన్ గా బయటకు వచ్చారు.. నగరిలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రారంభోత్సవంలో రోజా పాల్గున్నారు. తరువాత టీచర్ గా మారి పిల్లలకు పాఠాలు చెప్పారు...
చాక్‌పీస్ తీసుకుని బ్లాక్ బోర్డుపై "కలలు కనండి... సాకారం చేసుకోండి" అంటూ రాశారు... పిల్లలకి మంచి సూక్తులు నేర్పారు.... సహజ దొరనికి భిన్నంగా రోజా ప్రవర్తన చూసి అందరూ ఆచర్యపోయారు...
కాని ఇక్కడ రోజా ఒక చిన్న తప్పు చేశారు.... "చేసుకోండి" బదులు "చేసుకొండి" అని తెలుగులో తప్పుగా రాసారు... అది పెద్ద తప్పు కాకపోయినా, ఎవరన్నా నోరు జారితే రెచ్చిపోయే రోజా.. ఇలా తప్పులు రాస్తే ఎలా... నోరు జారితే పప్పు, ఉప్పు అని సంబోధించే రోజా, మరి ఏ పప్పో ? తప్పులు మానవ సహజం, అనే విషయం ఇప్పటికైనా రోజా గుర్తించి, ఎదుటివారికి గౌరవం ఇచ్చి మాట్లాడుతారు అని ఆశిద్దాం...