ఒక ఎమ్మల్యే హోదాలో ఉండి కూడా, నోటి వెంట బూతులు తప్ప, మంచి మాటలు మాట్లాడని జగన్ పార్టీ ప్రియ శిష్యురాలు రోజా పై మహిళలు తిరగబడ్డారు. మగ వారు కూడా భరించలేని బూతులు మాట్లాడే రోజా, మొన్న పెనమలూరు ఎమ్మల్యే బోడె ప్రసాద్ ను టార్గెట్ చేసింది. అప్పట్లో విజయవాడలో వచ్చిన కాల్ మనీ కేసు పై, అప్పట్లోనే చంద్రబాబును ఉద్దేశిస్తూ కామ సియం అంటూ, పిచ్చి పిచ్చి వాగుడు వాగి, ఆ వాగుడు భరించలేక, అసెంబ్లీలో ఉన్న ఎమ్మల్యేలు అందరి విజ్ఞప్తి మేరకు, సంవత్సరం పాటు, అసెంబ్లీ నుంచి బహిష్కరణకు గురైంది రోజా.
అసెంబ్లీ వేదికగానే, సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రినే కామ సియం అంటూ సంభోదించిన ఇలాంటి మహిళకు, మిగతా వారు అంటే ఒక లెక్కా ? అందుకే పెనమలూరు ఎమ్మల్యే పై నెల రోజుల క్రితం ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. నెల రోజుల క్రితం రోజా కంకిపాడు వచ్చింది. అక్కడ ఈ సారి టికెట్ ఆసిస్తున్న పార్ధసారధి, తన మొఖం చూపిస్తే ఎవరూ ఓట్లు వెయ్యరని, రోజాని తీసుకువచ్చి ఒక మీటింగ్ పెట్టించారు. ఇంకేముంది, చాలా రోజుల తరువాత మైక్ దొరకటంతో రోజా రెచ్చిపోయింది. పార్ధసారధి ఎంతో గొప్ప వాడు అని, బోడె ప్రసాద్ 'సెక్స్ కుంభకోణంలో' ఉన్నాడు అంటూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అసలు బోడె ప్రసాద్ కు సెక్స్ కుంభకోణం ఏంటో అర్ధం కాలేదు.
రోజా నోరు తెరిస్తే నన్ను రేప్ చేసే దమ్ము ఉందా లాంటి మాటలు తప్పితే, వేరే మాటలు రావు. ఈ మాటలకు మగ వారు కూడా భయపడి రోజా నోటికి దూరంగా ఉంటారు. అయితే, రోజా పదే పదే తనను 'సెక్స్ కుంభకోణంలో' ఉన్నాడు అని చెప్తూ ఉండటంతో, బోడె ప్రసాద్ తీవ్రంగా స్పందించారు. నేను సెక్స్ 'కుంభకోణంలో' ఉన్నానని నీకు ఎలా తెలుసు, నువ్వు ఎమన్నా కంపెనీ నడిపావా ? నేను ఎక్కడన్నా తగిలనా అంటూ తీవ్రంగా స్పందించారు. నేను నాలుగేళ్ల నుంచి, రోజా ఇలా అంటున్నా రాజకీయ విమర్శలు అని ఊరుకున్నా అని, ఇప్పుడు నా ప్రజల ముందుకు వచ్చి, మళ్ళీ ఇలాంటి మాటలే రోజా మాట్లాడుతుంటే, చూస్తూ ఊరుకోను అంటూ, బోడె ప్రసాద్ తీవ్రంగా స్పందించారు.
అయితే, బోడె ప్రసాద్ వ్యాఖ్యల పై, రోజా పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. అయితే ఇవి రాజకీయ ఆరోపణలు కవటంతో, పోలీసులు ఈ కేసు గురించి పెద్దగా పట్టించుకోలేదు. కాని, రోజా మాత్రం, హైకోర్ట్ కి వెళ్లారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపేలా పోలీసులను ఆదేశించాలని రోజా హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్లో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విజయవాడ పోలీసు కమిషనర్, పెనమలూరు ఎస్‌హెచ్‌వోలను ప్రతివాదులుగా చేర్చారు. అయితే, ఇక్కడ వింత ఏంటి అంటే, నోరు తెరిస్తే బూతులు మాట్లాడే రోజా, ఎదురు బోడె ప్రసాద్ తనని బూతులు తిట్టాడు అని కేసు పెట్టి, హైకోర్ట్ దాకా వెళ్ళటం. మనం మంచిగా ఉంటే, హుందాగా విమర్శలు చేస్తే, ఎవరూ మనల్ని అనరు. ఎదుటి వాళ్ళని, కావాలని రెచ్చగొట్టి, బూతులు తిట్టి, వారు స్పందిస్తే, వారి మీదే కేసు పెట్టటం, తాజా రాజకీయం ఏమో.. మొత్తానికి ప్రశాంతంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గంలో, రోజాను పంపించి, ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేపించి, జగన్ సక్సెస్ అయ్యాడు.