ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి మధ్య దూరం సుమారు 60 కిలోమీటర్లు. ఇక్కడి ఫెర్రీ నుంచి అక్కడికి ఇసుక లారీ వెళ్లాలంటే ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ పరిస్థితుల్లో రెండు, మూడు గంటలు పడుతుంది. ఈ దూరాన్ని, కాలుష్యాన్ని తగ్గించి తక్కువ సమయంలో ఎక్కువ సరుకును జల రవాణా చేయడానికి రోరో కార్గో (రోల్ ఆన్ - రోల్ ఆఫ్) రవాణా విధానం విజయవాడలో త్వరలో రాబోతోంది. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా రవాణాను ఆరంభించడానికి సర్కారు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రోరో కార్గో రవాణా మనదేశంలో కోల్‌కతా, పట్నా, కేరళ రాష్ట్రల్లో నడుస్తోంది. అంతర్గత జలరవాణా అభివృద్ధిలో భాగంగా దీనికి విజయవాడ నుంచి శ్రీకారం చుట్టబోతోంది.
విజయవాడ: తక్కువ సమయంలో ఎక్కువ సరుకును రవాణా చేయడానికి రోరో కార్గో (రోల్ ఆన్ - రోల్ ఆఫ్) రవాణా విధానం త్వరలో రాబోతోంది. ఇబ్రహీంపట్నం నుంచి అమరావతికి మధ్య సుమారు 60 కిలోమీటర్లు దీనిని అమలు చేయనున్నారు. అంతర్గత జలరవాణా అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టింది. సాధారణంగా జల రవాణాకు వంతెనలు లేని చోట్ల పంట్లును నడుపుతుంటారు. నదికి ఓ వైపున ఉన్న వాళ్లు రెండో వైపునకు దీనిపైనే వెళ్తారు. ఈ పంట్లను కర్రల సహాయంతో నలుగురైదుగురు వ్యక్తులు ముందుకు తోసుకెళ్లారు. వీటిపై వివిధ రకాల వస్తువులతోపాటు ప్రజలను తీసుకెళ్లేవారు. రోరో కార్గో రవాణా విధానం పంట్లు మాదిరిగానే ఉంటుంది. పూర్తిగా యంత్రాల సహాయంతో నడుస్తోంది.
పెద్ద పరిమాణంలో ఉండే స్టీలు బార్జి నది ఒడ్డున ఉన్న ర్యాంపు వద్ద ఆగి ఉంటుంది. ఇటుక, ఇటుక, కంకర వంటి లోడ్‌తో ఉన్న ట్రక్లు గానీ, ఇతర సరుకులు ఉన్న లారీలు గానీ నేరుగా ఈ బార్జిపైకి తీసుకెళ్లారు. ఇవన్నీ బార్జిపై వరుసగా ఒకదాని వెనుక మరొకటి ఉంటాయి. ఇబ్రహీంపట్నంలో కొత్తగా తయారు చేయించిన బార్జిపై ఒకేసారి 15 టిప్పర్లను తీసుకెళ్లవచ్చు. బార్జికి కుడి, ఎడమ వైపున రెండు టగ్‌లు ఉంటాయి. ఈ రెండూ బార్జిను తోసుకుంటూ అవతలి ఒడ్డున ఉన్న ర్యాంపు దగ్గరకు చేర్చుతాయు. అక్కడి నుంచి డ్రైవర్లను నేరుగా బార్జిపై నుంచి టిప్పర్లను కిందికి దింపుకోవచ్చు. ఈ రోరో రవాణా వల్ల సమయం, ఖర్చు ఆదా అవుతుంది. దీనితోపాటు వాహన, ధ్వని కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది.