మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గురించి తెలియని వారు ఉండరు. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత ముఖ్యమంత్రి అవ్వటం, తరువాత జగన్ ఆయన నాయకత్వాన్ని వ్యతిరేకించి, తనకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి రోశయ్యకు ఇచ్చారని చెప్పి, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టటం, తరువాత రాష్ట్ర విభజన, ఇలాంటి వాటి అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి రోశయ్య. తరువాత కొంత కాలం తమిళనాడు గవర్నర్ గా చేసారు. ఇప్పడు రాజకీయాల నుంచి రిటైర్డ్ అయ్యి ఇంటి పట్టున ఉంటున్నారు. తన రాజకీయ జీవితంలో ఎంతో మందిని, ఎన్నో సంఘటనలు చుసిన రోశయ్య ఒక వెబ్ ఛానెల్ కి సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్నో విషయాల పై మాట్లాడారు.
ఈ సందర్భంగా తాజాగా జరుగుతున్న రాజకీయ విషయాల పై కూడా మాట్లాడారు. ముఖ్యంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన, జగన్ గురించి, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి ఆయన అభిప్రాయాలు చెప్పారు. ఈ ఇంటర్వ్యూ లో ఎన్నో విషయాలకు తన అబిప్రాయాలు చెప్పిన రోశయ్య, పవన్ విషయం గురించి వచ్చే సిరికి అసలు స్పందించలేదు. అప్పట్లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు మీరు అన్నీ చూసారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అంటూ కొత్త పార్టీ పెట్టారు, ఇప్పుడు పవన్ పై మీ అభిప్రాయం ఏంటి అని ప్రశ్నంచగా.. చాలా సాదాసీదా సమాధానం ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం అవతలి వ్యక్తి వంతయ్యింది. ఇంతకూ ఆయన ఏమన్నారంటే, ఆ పార్టీ గురించి పెద్దగా ఆలోచించడం లేదంటూ జవాబిచ్చారు. అభిప్రాయం చెప్పడానికి ఆసక్తి లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు.
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది, ఆయన పరిపాలన పై మీ అభిప్రాయం ఏంటి అని అడగగా, నేను కాంగ్రెస్ పార్టీ లో ఉన్నా, మేము ప్రతిపక్షం, ఆయన ఎలా పరిపాలిస్తున్నా, సరిగ్గా పరిపాలించటం లేదు అనే చెప్తాం, నేను అదే చెప్తున్నా అని సమాధానం చెప్పారు. మరి మీరు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటున్నారు కదా అంటే, అవన్నీ తప్పవు రాజకీయం అని చెప్పారు. జగన్ గురించి అభిప్రాయం అడుగుతూ, రాజశేఖర్ రెడ్డికి, జగన్ కి తేడా అడగగా, నేను ఎప్పుడో జగన్ తో విభేదించా, అప్పటి నుంచి ఆయన్ను పెద్దగా పట్టించుకోవటం లేదు, ఆయన ఏమి చేస్తున్నాడో ఏంటో, నాకు తెలియదు అని సమాధానం ఇచ్చారు. ఆ వీడియో ఇక్కడ చూడవచ్చు... https://youtu.be/mgjXUM3u8_o