మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యకు, అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టక పోవటం పై, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల హోరు గత రెండు రోజులుగా కొనసాగింది. ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ ను జగన్ మోహన్ రెడ్డి అవమానించారు అంటూ, గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. అనేక జిల్లాల్లో కొణిజేటి ఆర్యవైశ్య సంఘాలు గత రెండు రోజులుగా, జగన్ మోహన్ రెడ్డి వైఖరి పై నిరసన తెలిపాయి. రోశయ్య చనిపోయిన సమయంలో కూడా, జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు అందరినీ బాధించింది. అప్పుడు కూడా, అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేల పెళ్లిళ్లకు హైదరాబాద్ వెళ్ళిన జగన్ రెడ్డి, రోశయ్య చనిపోతే మాత్రం వెళ్ళలేదు. రాజశేఖర్ రెడ్డి ఒక అన్నలా భావించే రోశయ్యకు, జగన్ పదే పదే అవమానాలు చేయటం, నిన్న గౌతం రెడ్డికి నివాళులు అర్పించి, రోశయ్యకు మాత్రం సంతాపం ప్రకటించక పోవటం పట్ల, నిరసనలు హోరెత్తాయి. దీంతో ఆర్యవైశ్యుల నిరసనలకు జగన్ సర్కార్ దిగి వచ్చింది. రేపు అసెంబ్లీలో రోశయ్యకు సంతాపం ప్రకటిస్తారు. సంతాప తీర్మానం అనంతరం అసెంబ్లీ కార్యక్రమాలు కొనసాగుతాయి. మొత్తానికి, రోశయ్యకు సంతాపం తెలపటం కోసం, ఇంత కష్టపడాల్సి వచ్చింది మరి.
ఆర్యవైశ్యుల నిరసనలకు దిగొచ్చిన జగన్ ప్రభుత్వం.. రేపు అసెంబ్లీలో తీర్మానం...
Advertisements