ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గా పని చేసిన కొణిజేటి రోశయ్య, డిసెంబర్ నెలలో చనిపోయిన సంగతి తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పైన, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరు పైన గతంలోనే విమర్శలు వచ్చాయి. పెళ్లిళ్లకు, పేరంటాలకు బయటకు వచ్చే జగన్, రోశయ్య పార్ధివదేహానికి నివాళులు అర్పించకపోవటం పై, పెద్ద చర్చే జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి ఈ అంశం తెర పైకి వచ్చింది. నిన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన సంగతి తెలిసిందే. సహజంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు గవర్నర్ స్పీచ్ ఉంటుంది. రెండో రోజు సంతాప తీర్మానాలు ఉంటాయి. ఈ రోజు అలాగే మేకపాటి గౌతం రెడ్డి మృతి పైన సంతాప తీర్మానం ప్రవేశ పెట్టి, గౌతం రెడ్డికి నివాళులు అర్పించారు. అయితే సహజంగా సంతాప తీర్మానం తరువాత, సభ వాయిదా వేయటమో, లేక ఆ రోజుకి సభ ముగించటమో జరుగుతుంది. ఇక్కడ మాత్రం, వాయిదా వేసి, రేపు కూడా అసెంబ్లీకి సెలవు తీసుకున్నారు. గౌతం రెడ్డి మృతికి సంతాపంగా రేపు సెలవు అని చెప్పారు. టిడిపి నేతలు మాత్రం, బొత్సా కుమారుడి పెళ్లి రిసెప్షన్ ఉందని, అందుకే సెలవు తీసుకున్నారని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే, ఇప్పుడు రోశయ్య సంతాపం విషయం కూడా బయటకు వచ్చింది.

rosaiah 08032022 2

ఈ రోజు అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్ గా పని చేసిన రోశయ్యకు ఎందుకు సంతాపం ప్రకటించ లేదు అంటూ, విమర్శలు వస్తున్నాయి. అయ్యన్నపాత్రుడు కూడా ఇదే విషయం పై ప్రశ్నించారు. రోశయ్య ఒక మాజీ ముఖ్యమంత్రి అని, ఆయన అంటే, జగన్ రెడ్డికి ఇష్టం లేకపోయినా, కనీస సాంప్రదాయాలు పాటించాలి కదా అని, విమర్శలు వస్తున్నాయి. మేకపాటి ఒక మంత్రిగా చేసారని, ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారని, మరి రోశయ్య ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, అనేక సార్లు మంత్రిగా, ఒక రాష్ట్ర గవర్నర్ గా పని చేసిన విషయాన్ని గుర్తుకు తెస్తున్నారు. దీనికి తోడూ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, రోశయ్య ఎంతో ఆత్మీయుడుగా, ఒక అన్నలా ఉండేవారని, కనీసం అది కూడా జగన్ కు ఎందుకు గుర్తుకు లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. రోశయ్య అంటే జగన్ కు ముందు నుంచి కోపం అనే, ఇప్పుడు అదే చూపిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మరి అసెంబ్లీలో రాబోయే రోజుల్లో, రోశయ్య మృతి పట్ల సంతాపం ప్రకటిస్తారో లేదో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read