నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించటంతో, కర్నూల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ పేరుతో, పార్టీ నడుపుతున్న ఆ పార్టీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, పార్టీ మూసేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, త్వరలోనే ఆయ తెలుగుదేశం తీర్ధం పుచ్చుకోనున్నారు అని సమాచారం.
2014 ఎన్నికలకు ముందుగా తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో ప్రత్యేక రాయలసీమ కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. 2014లో కానీ, ఇటీవల జరిగిన నంద్యాల ఉపఎన్నికల్లో కూడ బైరెడ్డికి ఆశించిన ఫలితం దక్కలేదు. నంద్యాల ఉప ఎన్నికల్లో రెండువందల ఓట్లు కూడ దక్కలేదు.
నంద్యాల ఫలితం వచ్చిన తర్వాత సినీ నటుడు బాలకృష్ణ, మంత్రి పరిటాల సునీత సమక్షంలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి చర్చించారని సమాచారం. టిడిపిలో చేరేందుకు బైరెడ్డి ఆసక్తిని చూపారని సమాచారం. రాయలసీమను చంద్రబాబు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు అని, ఇక సొంత పార్టీ పెట్టి చేసేది ఏమి లేదు అని, అందుకే తెలుగుదేశంలో చేరిపోవాలని కార్యకర్తల సూచన మేరకు, బైరెడ్డి తన సొంత పార్టీ మూసేసి, తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.