తన తండ్రి అక్రమ అరెస్ట్, అదే విధంగా సిఐడి కస్టడీలో తన తండ్రి పై సిఐడి పోలీసులు కొ-ట్ట-టం, ఈ మొత్తం వ్యవహారం పై, ఈ కేసు విచారణను సిబిఐకి అప్పగించాలి అంటూ, ఎంపీ రఘురామకృష్ణం రాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటీషన్ పై , ఈ రోజు కొద్ది సేపటి క్రితం సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. న్యాయమూర్తి వినీతి శరన్ బెంచ్ ముందుకు ఈ పిటీషన్ విచారణకు వచ్చింది. అయితే విచారణ అంత తొందరగా ఇప్పటికిప్పుడు జరపవలసిన అవసరం లేదని, ముందుగా ఈ పిటీషన్ లో ని ప్రతివాదుల వివరణ కూడా తీసుకుంటామని సుప్రీం కోర్టు తెలిపింది. ప్రస్తుతం ఇది వెకేషన్ బెంచ్ కాబట్టి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి, రెగ్యులర్ బెంచ్ వచ్చినప్పుడు దీని పై విచారణ జరుపుతామని, న్యాయమూర్తి వినీత్ శరన్ స్పష్టం చేసారు. అయితే సరిగ్గా ఇక్కడే రఘురామకృష్ణం రాజు తరుపు న్యాయవాది వేసిన పాచిక అద్భుతంగా పని చేసింది. రఘురామకృష్ణం రాజు తనయుడు భరత్ తరుపున హాజరు అయిన న్యాయవాది ముకుల్ జోక్యం చేసుకుని, మీరు ఎప్పుడు విచారణ చేసినా తమకు అభ్యంతరం లేదని, కాకపోతే తొందరగా వింటే బాగుటుందని అభ్యర్ధిస్తూ, మరో విజ్ఞప్తి కూడా చేసారు. ప్రస్తుతం ఉన్న ప్రతివాదుల నుంచి జగన్ మోహన్ రెడ్డి, ఏపి ప్రభుత్వం, సిఐడి అధికారులను తొలగించాలని కోరారు.

sc 25052021 2

కేవలం యూనియన్ అఫ్ ఇండియా, సిబిఐ ని మాత్రమే పార్టీ చేయాలని అభ్యర్ధించారు. దానికి, సుప్రీం కోర్టు అంగీకరించింది. కేవలం కేంద్ర ప్రభుత్వం, సిబిఐకి మాత్రమే నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లోగా, కేంద్ర ప్రభుత్వం, సిబిఐ ఈ పిటీషన్ పై తమ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుందని, ఆరు వారాల తరువాత దీని పై విచారణ జరుపుతాం అంటూ, ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరుపున హాజరు అయిన, న్యాయవాది దవే, తమ ప్రభుత్వ వాదనలు వినకుండా, కేవలం కేంద్ర ప్రభుత్వం, సిబిఐ వాదనలు విని, చివరకు సిబిఐకి అప్పచేప్పితే, తమ వాదన వినే వారు ఎవరు, ఎందుకు తమ వాదన వినరు అని అభ్యంతరం వ్యక్తం చేసారు. అయితే కోర్టు స్పందిస్తూ, మీరు ఇంప్లీడ్ అవ్వండి, దాన్ని పరిశీలిస్తాం కానీ, మిమ్మల్ని ప్రతి వాదులుగా చేర్చం అంటూ, తేల్చి చెప్పారు. అయితే రఘురామ రాజు న్యాయవాదులు చేసిన పనితో, ఇప్పుడు కేవలం కేంద్రం, సిబిఐ మాత్రమే జరిగిన దాన్ని కోర్టుకు చెప్పి, తమ అభిప్రాయం చెప్తాయని, సిబిఐ విచారణకు కేంద్రం కూడా అభ్యంతరం చెప్పే అవకాశాలు ఉండవని విశ్లేషకులు అంటున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read