వైసీపీ శ్రేణులకు రఘురామకృష్ణం రాజు బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులకు కంటిలో నలుసులా మారిన రఘురామరామ రాజు, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటీషన్ రద్దు చేయాలి అంటూ, కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అక్రమఆస్తుల కేసులో 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు ఉన్న జగన్, 16 నెలలు జైల్లో ఉండి, ప్రస్తుతం కండీషనల్ బెయిల్ పై బయట తిరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బెయిల్ ని అడ్డు పెట్టుకుని, సాక్ష్యులను ప్రభావితం చేస్తారని, ఇప్పటికే అనకే మందికి పదవులు కూడా ఇచ్చారని, జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేసి, విచారణ వేగవంతం చేయాలి అంటూ, రఘురామకృష్ణం రాజు సిబిఐ కోర్టులో, పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పిటీషన్ ఫైల్ అవ్వకుండా, కొన్ని కుట్రలు జరిగాయి అంటూ రఘురామరాజు ఆరోపించారు కూడా. అయినా ఆయన పట్టు వీడకుండా, పిటీషన్ ఫైల్ చేసారు. అయితే ఈ పిటీషన్ అసలు విచారణకు కూడా రాదని, ఇది విచారణ అర్హత కూడా కాదు అంటూ, వైసీపీ శ్రేణులు వాదించాయి. అయితే రఘురామ రాజు మాత్రం, అనుకున్నది సాధించారు. కోర్టు ఈ పిటీషన్ విచారణకు తీసుకునేలా, కోర్టుని ఒప్పించగలిగారు. అంతా పక్కాగా, పిటీషన్ ఉండటంతో, సిబిఐ కోర్టు రఘురామరాజు వేసిన పిటీషన్ ని విచారణకు స్వీకరించింది.
దీని పై రఘురామ రాజు స్పందించారు. ఆయన మాట్లాడుతూ " మీ అందరికీ ఒక శుభవార్త. ఇప్పుడే సిబిఐ కోర్టు, జడ్జి గారు ఆర్డర్స్ ఇచ్చారు. ఏదైతే మొన్న జగన్ మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు పిటీషన్ నేను వేయటం జరిగిందో, ఆ పిటీషన్ విచారణ అర్హత ఉందా లేదా అన్న దాని మీద, ఈ రోజు తీర్పు ఇస్తారాని మనందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఆశించినట్టుగానే, నేను వేసిన పిటీషన్ కు విచారణ అర్హత ఉందని చెప్పి, ఈ రోజు తీర్పు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇస్తారు. సిబిఐకి కూడా ఇస్తారు. వారిని కౌంటర్ ఫైల్ చేయమని అడుగుతారు. చూద్దాం. ముందు టెక్నికల్ గా కొన్ని క్లారిఫికేషన్స్ అడిగితే, మడిచి పెట్టుకోమన్నారు. ఇప్పుడు తీరాందా. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, రాస్కల్స్. మాట జారే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నోటికి వచ్చినట్టు వాగకండి. ఏమైంది ఇప్పుడు ? ముందు ఉంది ముసళ్ళ పండుగ. ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం, మా పార్టీ కోసం, నేను ఈ పోరాటం చేపట్టాను." అని రఘురామరాజు అన్నారు.