యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ మధ్య రాజధాని రచ్చబండ కార్యక్రమం, వారినికి రెండు సార్లే చేస్తున్నా, ఆయన పేల్చుతున్న పంచ్ లు మాత్రం, సూపర్ గా పేలుతున్నాయి. ఓవర్ హైప్ లేకుండా లాజికల్ గా మాట్లాడుతూ ఉండటంతో, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వీక్షిస్తున్నారు. ఇక పొతే, రేపు సోమవారం అంటే, నవంబర్ 16వ తారీఖు టెన్షన్, వైసీపీలో అధికంగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం రెడ్డి చేసిన పనికి, కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద సుప్రీం కోర్ట్ లో కేసులు పడ్డాయి. హైకోర్ట్ జడ్జిల పై, అలాగే సుప్రీం కోర్టు కాబోయే చీఫ్ జస్టిస్ పై, జగన్ ఫిర్యాదు చేస్తూ, చీఫ్ జస్టిస్ అఫ్ ఇండియాకు లేఖ రాసారు. అయితే ఆ లేఖను ప్రెస్ మీట్ పెట్టి మరీ బయటకు విడుదల చేయటం, వివాదాస్పదం అయ్యింది. ఒక పక్క చీఫ్ జస్టిస్ నోటీస్ లో ఉండగానే, దాదాపుగా ఏడు మంది జడ్జిల పై ఆరోపణలు చేస్తూ, ఆ ఆరోపణలు బహిరంగ పరచటం పై, దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. అన్ని రాష్ట్రాల బార్ అసోసియేషన్స్, వివిధ వర్గాలు దీన్ని ఖండించారు. మరి కొంత మంది సుప్రీం కోర్టులో జగన్ పై కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కింద కేసులు కూడా వేసారు. అయితే దాదాపుగా 45 రోజులు తరువాత, ఈ కంటెంప్ట్ అఫ్ కోర్ట్ కేసుల్లో కదలిక రావటం, నవంబర్ 16న ఈ కేసులు లిస్టు కావటంతో, సుప్రీం కోర్టు ఏమి చెప్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

rrr 14112020 2

ముఖ్యంగా వైసీపీ శ్రేణులు, ఈ విషయంలో ఏమి అవుతుందా అని భయం భయంగా ఉన్నారు. అయితే అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామ రాజు మాత్రం ఒక అడుగు ముందుకు వేసి, నవంబర్ 16 న జగన్ భవితవ్యం తేలిపోతుందని అంటున్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన, నవంబర్ 16 న జగన్ రాజీనామా కూడా చెయ్యాల్సి రావచ్చని అంటున్నారు. జగన్ చేసిన కంటెంప్ట్ అఫ్ కోర్ట్ అని అందరికీ తెలిసిందే అని, ఆయన ముందు రెండే ఆప్షన్స్ ఉన్నాయని, ఒకటి బేషరతుగా సుప్రీం కోర్టుకు తప్పు అయిపోయిందని చెప్పటం, రెండోది తాను రాజీనామా చేసి, ఆ స్థానంలో మరొకరిని పెట్టి నడిపించటం అని, రఘురామరాజు కుండ బద్దలు కొట్టేసారు. గతంలో నీలం సంజీవ రెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఇలాగే కోర్టులు తప్పు బట్టటంతో రాజీనామా చేసిన చరిత్ర ఉందని, , రాజ్యాంగంలోని కన్వెన్షన్లకు లోబడి రాజీనామా చేసారని, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారికి కూడా అదే పరిస్థితి ఉందని రఘురామరాజు అన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి, తప్పుడు సలహాలు వినకుండా, జగన్ మోహన్ రెడ్డి సుప్రీం కోర్టులో తప్పు ఒప్పుకుంటే, అందరికీ మంచిదని, ఆయన ఇచ్చిన హామీలు చాలా పెండింగ్ లో ఉన్నాయి కాబట్టే, ఆయానే సియంగా ఉండాలని తాను కోరుకుంటున్నాను కాబట్టి, కోర్టులో ఆయన తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరితే తప్పితే, ఈ సమస్య ముగిసిపోదని రఘురామ రాజు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read