ఈ రోజు రాజ్యసభలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి, వెంకయ్య నాయుడుకి క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే. అన్ని పార్టీలు హెచ్చరించటం, వివిధ పార్టీలు చర్యలు తీసుకోవాలని కోరటంతో, విజయసాయి రెడ్డి దిగి వచ్చి, క్షమాపణ చెప్పారు. అంతే కాదు, బీజేపీకి ఈ చర్య పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నిన్న అంతలా విరుచుకుపడిన విజయసాయి రెడ్డి, ఈ రోజు ఇలా వెంటనే దిగి వచ్చి, క్షమాపణ చెప్పటం వెనుక, ఏదో జరిగిందని అందరూ భావిస్తూ ఉండగా, వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామాకృష్ణం రాజు ఈ రోజు జరిగిన రాజధాని రచ్చబండలో అసలు విషయం చెప్పారు. విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పటం వెనుక ఉన్న కారణం చెప్పారు. విజయసాయి రెడ్ది క్షమాపణ చెప్పటం వెనుక, జగన్ మోహన్ రెడ్డి ఉన్నారని రఘురామకృష్ణం రాజు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి డోస్ ఇవ్వటం వల్లే, ఈ రోజు విజయసాయి రెడ్డి క్షమాపణ చెప్పి ఉంటారని తాను అనుకుంటున్నా అని రఘురామరాజు అన్నారు. ఇక నుంచి అయినా విజయసాయి రెడ్డి తన హద్దులు తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది అని రఘురామరాజు అన్నారు. విజయసాయి రెడ్డి, ఉపరాష్ట్రపతి పై నిన్న చేసిన వ్యాఖ్యలకు కనీసం ఆరు నెలలు శిక్ష పడి ఉండేదని అన్నారు. విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అంత సీరియస్ వ్యాఖ్యలు అని అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి మందలించి ఉంటారని, అందుకే సారి చెప్పి ఉంటారని అన్నారు. అలాగే సభలోనే మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా హెచ్చరించటం మనం చూసాం అని అన్నారు. విజయసాయి రెడ్డి కూడా తప్పు అయిపోయిందని, ఏదో మూడ్ లో ఉండి ఈ వ్యాఖ్యలు చేశాను, మరోసారి చేయను అని చెప్పారని, అన్నారు. గత కొంత కాలంగా, ఉక్కుసంకల్పంతో, విజయసాయి రెడ్డి పై విరుచుకుపడుతున్న విజయసాయి రెడ్డి, నిన్న నిమ్మగడ్డ గారు ఏదో కంటి ఇన్ఫెక్షన్ వచ్చి కంటి ఆసుపత్రికి వెళ్తే, కంటి చూపు లేదా, బుర్ర లేదా, వెళ్ళాల్సింది ఎర్రగడ్డకు అని మాట్లాడిన విజయసాయి రెడ్డి, 24 గంటల్లోనే తనకే బుర్ర లేక మాట్లాడానని , ఆ దేవుడే చెప్పించాడని, రఘురామరాజు కౌంటర్ ఇచ్చారు. విజయసాయి రెడ్డి ఏదో కన్ఫ్యూషన్ లో ఉండి మాట్లాడనని సభలోనే చెప్పారు, ఆయనతో పరువు పోయే ప్రమాదం ఉంది జగన్ రెడ్డి గారు, మీ పరువు, ఆయన పరువుతో పాటు, మా పరువు కూడా పోతుంది అంటూ, రఘురామరాజు కౌంటర్ ఇచ్చారు.