నర్సాపురం ఎంపీ రఘురామరాజు మరోసారి తనదైన శైలిలో పంచ్ లు వేసారు. ఇలా చెప్పాలి అంటే కూడా భయం వేస్తుంది. ఎందుకుంటే రఘురామరాజు ప్రెస్ మీట్ అయిన తరువాత, విలేఖరులు మీ పంచ్ బాగుంది అంటూ కామెంట్లు చేసారని, ఇది కూడా రాజద్రోహం కిందకు వస్తుంది అంటూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఇచ్చిన తరువాత, ఇలా కూడా చెప్పటం తప్పు ఏమో అనే విధంగా మీడియా ఆలోచన చేసే పరిస్థితి వచ్చింది. ఇక విషయానికి వస్తే, ఈ రోజు సాక్షి పేపర్ లో, రఘురామరాజు, లోకేష్, చంద్రబాబు మధ్య వాట్స్ అప్ సంభాషణ జరిగిందని, అందులో రఘురామరాజు , చంద్రబాబుకి జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పంపించారని, చంద్రబాబు దాన్ని చూసారని, అలాగే లోకేష్ తో కూడా అనేక విషయాల పై రఘురామరాజు మాట్లాడారని, ఇదంతా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై, అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారని, అందుకే రాజద్రోహం కేసు పెట్టారు అంటూ సాక్షిలో రాసుకొచ్చారు. రఘురామ రాజు ఫోన్ సీజ్ చేసి, తరువాత సిఐడి ఆ ఫోన్ లో ఉన్న మెసేజ్ లు అన్నీ చూడగా, ఇవి బయట పడినట్టు సాక్షిలో రాసుకొచ్చారు. అయితే అది చదివిన ఎవరికైనా ఇందులో రాజద్రోహం ఏమి ఉందో అర్ధం కావటం లేదు. జగన్ మీద కేసులు ఉన్నది నిజం, ఆయన బెయిల్ మీద బయట ఉన్నది నిజం, ఆ బెయిల్ రద్దు చేయమని, వివిధ కారణాలతో రఘురామరాజు పిటీషన్ వేసారు.

rrr 20072021 2

అది చంద్రబాబుతో మాట్లాడి వేసరా, లోకేష్ చెప్తే వేసారా అనేది కోర్టుకు అనవసరం, అందులో ఎంత వరకు వాస్తవం ఉంది అనేది కోర్టు చుస్తుంది. అయితే బెయిల్ రద్దు పిటీషన్ వేయటమే రాజద్రోహం అనే విధంగా సాక్షి వండి వార్చింది. ఈ కధనం పై రఘురామరాజు స్పందించారు. అవును నేను చంద్రబాబుతో వాట్స్ అప్ చాట్ చేసింది నిజమే అనుకుందాం, అందులో తప్పు ఏముంది అని ప్రశ్నించారు ?తన ఫోన్ కోడ్ ను బ్రేక్ చేసి మరీ, వాట్స్ అప్ మెసేజ్ లు కల్పించి మరీ తాయారు చేస్తున్నారని అన్నారు.జగన్ బెయిల్ రద్దు చేయమని పిటీషన్ వేసి, దానికి సంబంధించిన సమాచారం వేల మందితో పంచుకున్నా అని, అందులో చంద్రబాబు కూడా ఉన్నది నిజమే అనుకున్నా, అది రాజద్రోహం ఎందుకు అవుతుందని ప్రశ్నించారు. సిఐడి విచారణ చేసే అంశాలు సాక్షిలో ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. నా ఫోన్ లో నేను ఎవరికో మెసేజ్ లు పెట్టుకుంటే, మీకు వచ్చిన నొప్పి ఏంటి, నువ్వు ఎవరు అడగటానికి అని ప్రశ్నించారు. ఈ వాట్స్ అప్ చాటింగ్ ఆరోపణలతో నన్ను మీరు ఏమి చేయలేరని, అయితే పెగాసెస్ తో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు పై నిఘా పెట్టారని తనకు తెలిసింది అంటూ బాంబు పేల్చారు. మరి ఇది నిజమో కాదో ప్రభుత్వమా ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read