కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తో, ఎంపీ రఘురామకృష్ణం రాజు ఈ రోజు భేటీ అవ్వటం ఢిల్లీలోనే కాక, రాష్ట్రంలో కూడా చర్చనీయంసం అయ్యింది. అమిత్ షా కార్యాలయానికి వెళ్ళిన రఘురామరాజు, సుమారుగా 20 నిమిషాల పాటు, ఆయనతో చర్చించారు. ఈ భేటీ సందర్భంగా, రఘురామకృష్ణం రాజు ఆరోగ్య పరిస్థితిని అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. అలాగే రఘురామకృష్ణం రాజు అరెస్ట్ సమయంలో జరిగిన విషయాలను కూడా రఘురామకృష్ణం రాజు, అమిత్ షా కు వివరించారు. గతంలోనే రఘురామకృష్ణం రాజు కుటుంబ సభ్యులు, రఘురామ ఆరెస్ట్ సమయంలో, ఢిల్లీ వెళ్లి అమిత్ షాని కలిసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాలు, సుప్రీం కోర్టులో కేసు తరువాత, రఘురామరాజు బెయిల్ పై బయటకు వచ్చారు. బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత, రఘురామకృష్ణం రాజు , కేంద్రం హోం మంత్రిని కలవటానికి ప్రయత్నం చేసినా, అమిత్ షా బిజీ షడ్యుల్ లో కుదరలేదని తెలుస్తుంది. అయితే ఈ రోజు రఘురామకృష్ణం రాజు, అమిత్ షాని కలిసారు. ఆరోగ్య పరిస్థితి, అరెస్ట్ చేసిన తీరుతో పాటుగా, ఏపిలో రాజకీయ పరిస్థితులు పై కూడా, రఘురామరాజుని, అమిత్ షా అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తుంది. ఏపిలో రాజకీయ పరిస్థితితులు పై ఎక్కువ సేపు చర్చించినట్టు తెలుస్తుంది.
దీంతో పాటుగా, ప్రస్తుతం పార్లమెంట్ జరుగుతున్న తీరు పై కూడా ఇరువురి మధ్య వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ సందర్భంగా అమిత్ షా దృష్టికి రఘురామరాజు మరో విషయం కూడా తీసుకుని వెళ్లారు. వైసీపీ నేతలు తనను అనర్హుడిగా ప్రకటించాలని, స్పీకర్ కు ఫిర్యాదు చేయటం, అసలు ఎందుకు వాళ్ళు ఆ అనర్హత పిటీషన్ వేసారు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలు కూడా, అమిత్ షాతో చర్చించినట్టు వార్తలు వచ్చాయి. అలాగే రాష్ట్రంలో సిఐడి పోలీసులు వ్యవహరిస్తున్నారు తీరు, ఏపి పోలీసులు వ్యవహారం పై కూడా రఘురామరాజు, అమిత్ షా దృష్టికి తెచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికి తన అరెస్ట్ నుంచి విడుదల వరకు, అలాగే తన ఫోన్ సంభాషణలు బహిర్గతం అవ్వటం పై కూడా, అమిత్ షా దృష్టికి తెచ్చారు. ఇవన్నీ విన్న అమిత్ షా, పార్లమెంట్ సమావేశాల తరువాత, అన్ని అంశాల పై, మళ్ళీ కలుద్దాం అంటూ, రఘురామకృష్ణం రాజుకు చెప్పినట్టు తెలుస్తుంది.