ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్, వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ లోనే కాక, తెలుగు రాష్ట్రాల్లో, ఢిల్లీలో కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఒక ఎంపీని పోలీస్ కస్టడీలో కొ-ట్ట-టం పై, విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రఘురామకృష్ణం రాజు అరెస్ట్ దగ్గర నుంచి, సుప్రీం కోర్టు ఆర్మీ హాస్పిటల్ లో చేర్పించాలి అంటూ ఇచ్చిన తీర్పు వరకు, అన్నీ సంచలన విషయాలు అనే చెప్పాలి. అయితే ఈ అరెస్ట్ వెనుక ఉన్నది జగన్ మోహన్ రెడ్డి అని కొంత మంది, సజ్జల రామకృష్ణా రెడ్డి అని కొంత మంది, సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఏపి ప్రభుత్వ పెద్దలు ఈ అరెస్ట్ వెనుక ఉన్నారు అనేది బహిరంగ రహస్యమే. అయితే పక్క రాష్ట్రం వెళ్లి అరెస్ట్ చేయటం, అలాగే ఒక ఎంపీని కొట్టినా, ఇప్పటి వరకు కేంద్రం నుంచి కానీ, స్పీకర్ కార్యాలయం నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవటం పై మాత్రం, అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అనుమానాలకు సమాధానంగా, సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నాయరణ తనదైన శైలిలో విశ్లేషణ ఇచ్చారు. నారాయణ ఏమి మాట్లాడినా సంచలనమే అవుతుంది. అలాంటిది ఇప్పుడు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నవి, అలాగే కేంద్రంలో జరుగుతున్న విషయాల పై స్పందించారు.

rrr 18052021 2

ముఖ్యంగా తెలంగాణాలో ఈటెల విషయం కానీ, ఆంధ్రప్రదేశ్ లో రఘురామకృష్ణం రాజు విషయం కానీ, సొంత పార్టీ నేతల పైనే, అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు దురదృష్టకరం అని అన్నారు. విమర్శలు అనేవి ప్రభుత్వాలు తట్టుకోలేక పోతున్నాయి అని అన్నారు. ముఖ్యంగా రఘురామకృష్ణం రాజు ఆరెస్ట్ విషయంలో, అటు కేంద్ర ప్రభుత్వం సహకారం కానీ, ఇటు కేసీఆర్ సహకారం కానీ లేకుండా, జగన్ మోహన్ రెడ్డి, హైదరాబాద్ వచ్చి ఒక ఎంపీని అరెస్ట్ చేసి, ఆయన్ను కొ-డ-తా-రా అని ప్రశ్నించారు. సిఆర్పీఎఫ్ పోలీసులు కూడా మౌనంగా ఎందుకు ఉన్నారని అన్నారు. ఇవన్నీ చూస్తుంటే, ఈ అరెస్ట్ వెనుక కేసీఆర్, మోడీ సహకారం ఉన్నట్టు అర్ధం అవుతుందని అన్నారు. ఎంపీ పైన ఇలాంటి ఘటన జరిగితే, ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదని అన్నారు. రఘురామరాజు వ్యాఖ్యలను తాను సమర్ధించటం లేదు అంటుంటే, ఈ మొత్తం వ్యవహారంలో కోర్టులను కూడా లెక్క చేయకుండా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు పై విస్మయం వ్యక్తం అవుతుందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read