రఘురామకృష్ణం రాజుకి బెయిల్ ఇస్తూ, నిన్న సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే దానికి సంబందించిన బెయిల్ ఆర్డర్ కాపీ కొద్దిసేపటి క్రితమే, సుప్రీం కోర్టు విడుదల చేసింది. అయితే ఇక రఘురామరాజుకి బెయిల్ పై విడుదల అయ్యే విషయం, ఆయన పూచికత్తుని, కింద కోర్టులో ఇచ్చిన తరువాత, ఆయన విడుదల అయ్యే అవకాసం ఉంది. కింద కోర్టు రిలీస్ ఆర్డర్ ఇచ్చిన తరువాత, ఆ కాపీని ఆర్మీ హాస్పిటల్ వైద్యులకి ఇస్తే, ఆయన్ను విడుదల చేసే అవకాసం ఉంది. అయితే ఈ ప్రక్రియ అంతా అవ్వటానికి సమయం పడుతుంది కాబట్టి, ఈ రోజు సాయంత్రం కుదరకపొతే, సోమవారమే రఘురామరాజు విడుదల అయ్యే అవకాసం ఉంది. అయితే నిన్న జరిగిన వాదోపవాదనలు తరువాత, కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఇందులో అయిదు కండీషన్లు పెట్టింది. మొదటిది ఆయన దర్యాప్తుకి పూర్తి సహకారం అందించాలని, కేసుకి సంబంధించి ఎలాంటి ఆధారాలు తారుమారు చేయకూడదని. రెండోది అయానను దర్యాప్తుకి పిలివాలి అంటూ, 24 గంటల ముందు, ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు సమాచారం ఇవ్వాలని. మూడోది, రఘురామరాజున లాయర్ సమక్షంలోనే విచారణ చేయాలని. నాలుగోది, రఘురామరాజు ,ఈ కేసుకి సంబంధించి, మీడియాతో, సోషల్ మీడియాతో మాట్లాడకూడదని.

sc 22052021 2

అయిదవది, లక్ష రూపాయాల పూచికత్తు, ఇద్దరు ష్యురిటి ఇవ్వాలని. ఇలా మొత్తం అయిదు కీలక అంశాలను బెయిల్ ఆర్డర్ లో కోర్టు పెట్టింది. ఇవన్నీ జెనెరల్ గా అన్ని కేసుల్లో, అందరికీ పెట్టే కండీషన్స్ ఏ. అయితే నిన్న ఒక వర్గం మీడియా మాట్లాడుతూ, రఘురామరాజుని, అసలు మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ మాట్లాడకూడదని, సుప్రీం కోర్టు చెప్పినట్టు, ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తూ, అదేదో తమ గొప్ప విజయంలాగా చెప్పుకున్నారు. అయితే ఈ రోజు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ కాపీలో, సుప్రీం కోర్ట్ ఈ విషయం పై స్పష్టత ఇచ్చింది. రఘురామరాజు కేవలం ఈ కేసు విషయం పైనే, మీడియాతో కానీ, ప్రింట్ మీడియాతో కానీ, సోషల్ మీడియాతో కానీ మాట్లాడకూడదు అంటూ, తన తీర్పులో స్పష్టం చేసింది. మరి నిన్న అంతా ప్రచారం చేసిన, ఆ వర్గం మీడియా, ఈ విషయం పై, నిన్న మేము తప్పు చెప్పాం, సుప్రీం కోర్టు చెప్పింది ఇది అంటూ, క్లారిటీ ఇస్తారో లేదో మరి. ఏది ఏమైనా, ఈ రోజు కానీ, సోమవారం కానీ రఘురామరాజు విడుదల అయ్యే అవకాసం ఉంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read