వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేసులో సంచలన వార్తా వెలుగులోకి వచ్చింది. ఆర్మీ హాస్పిటల్ లో రఘురామరాజుకు వైద్య పరీక్షలు చేసి, ఆ రిపోర్ట్ ని సీల్డ్ కవర్ లో, సుప్రీం కోర్టుకు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై ఈ రోజు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ విచారణలో ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ ని సుప్రీం కోర్టు జడ్జిలు చదివి వినిపించారు. ఈ నివేదికల సంచలన విషయాలు బయట పడ్డాయి. రఘురామ కృష్ణం రాజు ఎడమ కాలు పై, జెనరల్ ఫ్రాక్చర్ అయినట్టు సుప్రీం కోర్టు నివేదిక చదివి వినిపించింది. అలాగే అనేక వివిధ గాయాలు కూడా ఆయన కాలిగి గాయాలు ఉన్నాయని సుప్రీం కోర్టు బెంచ్ చెప్పింది. అయితే ప్రభుత్వ తరుపు న్యాయవాది మాత్రం, ఆ రిపోర్ట్ పై అనుమానాలు వ్యక్తం చేసారు. ఆ దెబ్బలు ఆయనకు ఆయనే కొట్టుకున్నారేమో అంటూ ప్రభుత్వ తరుపు న్యాయవాది వాదించారు. రఘురామకృష్ణం రాజు తరుపున హాజరు అయిన ముకుల్ స్పందిస్తూ, బెంచ్ తో మాట్లాడుతూ, గాయాలు ఉన్నాయని మేము చెప్పిన మాట నిజమే అయ్యిందని, పోలీసులు కొ-ట్టిం-ది నిజం అని తేలిందని, తమ క్లైంట్ కు వెంటనే బెయిల్ ఇవ్వాలని, అలాగే తమ క్లైంట్ పై జరిగిన ఈ అమానుషం పై, వెంటనే సిబిఐ తో విచారణ జరిపించాలని ఆదేశాలు జారీ చేయాలని, కోర్టు ని కోరారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వ తరుపు న్యాయవాది మాత్రం, అనుమానాలు వ్యక్తం చేసారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నివేదిక చక్కగా ఉందని, అందులో ఏమి లేదని ఉందని, మరి అక్కడ నుంచి వెళ్ళిన తరువాత, ఆర్మీ హాస్పిటల్ కు వెళ్ళిన తరువాత ఏమైనా జరిగి ఉండవచ్చు ఏమో, అని అనుమానం వ్యక్తం చేసారు. దీనికి స్పందించిన సుప్రీం కోర్టు జడ్జి, మేము అయాన్‌ను ఆర్మీ హాస్పిటల్ కు పంపించామని, ఆ హాస్పిటల్ కేంద్ర పరిధిలో కానీ, రాష్ట్ర పరిధిలో కానీ ఉండదు అని గుర్తు చేసారు. అయితే తమకు మెడికల్ రిపోర్ట్ కావాలని అన్నారు. దీంతో మీకు రిపోర్ట్ పంపిస్తామని, మధ్యానం 2.30 గంటలకు ఈ కేసు మళ్ళీ వింటామని కోర్టు చెప్పింది. అయితే ప్రభుత్వ తరుపు లాయర్ మాత్రం, ఈ కేసుని సోమవారం తీసుకోవాలని కోరగా, కోర్టు ఒప్పుకోలేదు. అయితే రఘురామ రాజు తరుపు న్యాయవాది మాత్రం, వెంటనే బెయిల్ పిటీషన్ పై వాదనలు వినాలని కోరగా, మేము మధ్యానం 2.30 గంటలకు, మీ వాదనలు వింటామని కోర్టు వాయిదా వేసింది.