జగన్ మోహన్ రెడ్డిని, ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వదిలి పెట్టేలా లేరు. జగన్ మోహన్ రెడ్డిని ముప్పు తిప్పలు పెడుతూ, తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న రఘురామరాజు, చివరకు ఏమి చేస్తారో తెలియదు కానీ, జగన్ మోహన్ రెడ్డికి మాత్రం చెవిలో జోరీగలా తయారయ్యారు. జగన్ మోహన్ రెడ్డి పై, 2012లో సిబిఐ అక్రమ ఆస్తులు కేసు కింద అభియోగాలు మోపటం, ఆ తరువాత ఈడీ కూడా రంగంలోకి దిగటంతో, మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి పై 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు నమోదు అయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైలు జీవితం కూడా అనుభవించి, తరువాత కండీషనల్ బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఇక్కడ అనూహ్యంగా 10 ఏళ్ళు అవుతున్నా, ఇంకా జగన్ కేసులు ట్రైల్స్ వరకు రాలేదు. ఇంకా డిశ్చార్జ్ పిటీషన్లు దగ్గరే కేసులు ఉండి పోయాయి. ఎందుకు జగన్ మోహన్ రెడ్డి కేసులు ఇంకా విచారణ ప్రారంభం కాకుండా, ఆలస్యం అవుతున్నాయో అర్ధం కావటం లేదు. అటు సిబిఐ కూడా ఈ విషయంలో దూకుడుగా వెళ్ళటం లేదు. అయితే ఈ తరుణంలో రఘురామకృష్ణం రాజు తగులుకున్నారు. ఇప్పటికే ఆయన జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ విషయంలో చివరకు సిబిఐ కూడా స్పందించాల్సిన పరిస్థితి తెచ్చారు.

rrr 04072021 2

ఇప్పుడు రఘరామకృష్ణం రాజు మరో ఎత్తుగడతో జగన్ ను ఇరికించే ప్రయత్నం చేసారు. అదే విధంగా, సిబిఐ, ఈడీని కూడా టార్గెట్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో సిబిఐతో పాటు ఈడీ కూడా సరిగ్గా విచారణ చేయటం లేదు అంటూ, తెలంగాణా హైకోర్టులో పిటీషన్ వేసి, రఘురామకృష్ణం రాజు మరో సంచలనానికి తెర లేపారు. ఇప్పటికే దర్యాప్తులో అనేక అంశాలను సిబిఐ, ఈడీ గుర్తించాయని, అయితే వాటి పై విచారణ మాత్రం జరగటం లేదని, సరైన విచారణ జరిగేలా అటు సిబిఐని, ఇటు ఈడీని ఆదేశించాలి అంటూ రఘురామకృష్ణం రాజు, తెలంగాణా హైకోర్టుని అభ్యర్ధిస్తూ పిటీషన్ దాఖలు చేసారు. సిబిఐ, ఈడీకి అనేక అంశాలు వారి దృష్టికి వచ్చిన, విచారణ చేయకుండా వదిలేసాయని పిటీషన్ లో తెలిపారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో సరైన ముగింపు ఇవ్వకుండా, సిబిఐ, ఈడీ విఫలం అయ్యాయని తెలిపారు. అందుకే దర్యాప్తులో గుర్తించిన అన్ని అంశాల పై విచారణ చేసేలా, సిబిఐ, ఈడీని ఆదేశించాలని రఘరామరాజు తెలంగాణా హైకోర్టుని అభ్యర్ధించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read