ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వైసీపీ మీద వస్తే, భుజాలు తడుముకుంటూ, జీవీఎల్ వచ్చి చేసిన హడావిడి చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ మీద ఏ ఆరోపణ వచ్చినా, వచ్చేసి హడావిడి చేసే జీవీఎల్, ఫోన్ ట్యాపింగ్ పై ప్రధానికి ఏమి సంబంధం ? కేంద్రం పరిధిలోకి రాదు అంటూ, అందుకున్నారు జీవీఎల్. అయితే జీవీఎల్ వ్యాఖ్యల పై కౌంటర్ ఇచ్చారు రఘురామరాజు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రానికి లేఖ రాసాను కాబట్టి, తాను ఈ విషయం పై స్పందిస్తున్నాని అన్నారు. ఆయన మాట్లాడుతూ "ఈ రోజు నేను ఈ వార్త సాక్షి పేపర్ లో చదివాను. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ నరసింహారావు గారు, ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన సూచన చూసాను. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైనా, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి కాబట్టి, ఆయన ఏ రాష్ట్రానికైనా సూచన ఇవ్వచ్చు. సూచన ఇవ్వటంలో తప్పు లేదు కానీ, చంద్రబాబు గారు రాసిన లేఖ ప్రధానికి, అంటే గవర్నమెంట్ అఫ్ ఇండియాకి ఇచ్చారు. అంటే నేను ఆయన మాట్లాడిన వీడియో చూడలేదు. సాక్షిలో వచ్చింది చూసాను. రెండూ వేరు అవ్వచ్చు. అయితే ఈ రోజు నేను చేసిన కధనం ప్రకారం, చంద్రబాబు గారికి అవసరం ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కాని, ముఖ్యమంత్రికి కానీ లేఖ రాసుకోవచ్చు అని జీవీఎల్ గారు సూచన అయితే ఇచ్చారు."
"చంద్రబాబు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసారు, అయితే వేరే పార్టీ అధికార పార్టీ సూచన వినాల్సిన పని లేదు, అయినా జీవీఎల్ ఎదో చెప్పారు. కానీ నేను అయితే, ఈయన మాటలు పాటించను. ఎందుకంటే స్టేట్ ఇంటలిజెన్స్ నా ఫోన్ ట్యాప్ చేస్తుంది అని, అదే రాష్ట్రానికి రాయటం భావ్యం కాదు కాబట్టి, నేను కేంద్ర ప్రభుత్వానికి రాసాను. అలాగే చంద్రబాబు గారు కూడా కేంద్రానికి రాసారు. ఆయనే కాదు, ఎవరైనా కేంద్రానికే రాస్తారు. అనుమానమే వారి మీద ఉన్నప్పుడు, వారికే ఎలా రాస్తాము. కేంద్రం జోక్యం చేసుకోదు అని, జీవీఎల్ అనటం పై నేను క్లారిటీ ఇవ్వాలి, నేను కేంద్రానికి ట్యాపింగ్ పై లేఖ రాసాను కాబట్టి. ఈ విషయం కేంద్ర హోం శాఖ పరిధిలోకి వస్తుంది. కేంద్రానికి సంబంధం లేదు అనంతం, అసంబద్ధంగా ఉంది. రాజస్తాన్ లో ఒక విధానం, కర్ణాటకలో ఒక విధానం, ఇక్కడ ఒక విధానం ఉండదు. రాజస్తాన్ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, బీజీపీ ఆరోపిస్తూ సిబిఐ కోరింది. ఏడాది క్రితం, కర్ణాటకలో కూడా బీజేపీ ఇలాగే కేంద్రాన్ని కోరింది. మరి ఏపిలో మాత్రం కేంద్రానికి సంబంధం లేదు, ఇక్కడ రాయకూడదు అని చెప్పటం ఏమిటి ? ఒక జాతీయ పార్టీకి, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండదు కదా. అది జీవీఎల్ వ్యక్తిగత అభిప్రాయం అయి ఉంటుంది." అని రఘరామరాజు అన్నారు.