ఈ మధ్య కాలంలో వచ్చిన జై భీమ్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యింది అనేది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఏపిలో దళితుల అణిచివేత కూడా అదే స్థాయిలో ఉండటంతో, ఏపి లో కూడా, ఆ సినిమాకి కనెక్ట్ అయిన వారు ఉన్నారు. ఆ సినిమాలో సూర్య చేసిన ఆ క్యారక్టర్, జస్టిస్ చంద్రు అనే వ్యక్తిది. అయితే తమిళనాడులో ఉన్న జస్టిస్ చంద్రు, నిన్న విజయవాడలో ప్రత్యక్ష్యం అయ్యారు. సినిమా పైన సదస్సు అని కొంత మంది ఆయన్ను తీసుకుని వచ్చారు. ఆయన ఇక్కడ ఏపిలో జరుగుతున్న దళితుల మారణహోమం గురించి ప్రస్తావిస్తారని, మరీ ముఖ్యంగా మన కళ్ళ ముందే న్యాయం కోసం పోరాడి చనిపోయిన డాక్టర్ సుధాకర్, శిరోమండనం వర ప్రసాద్ గురించి ప్రస్తావిస్తారని అందరూ భావిస్తే ఆయన మాత్రం, వైసీపీ ట్యూన్ అయిన, కోర్టులు, జడ్జిల పైన విమర్శలు అనే టాపిక్ ఎత్తుకున్నారు. అయితే ఈ వ్యాఖ్యల పై రఘురామకృష్ణం రాజు తీవ్రంగా స్పందించారు. రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ., "న్యాయమూర్తి, అలాగే జైభీమ్ సినమాలో సూర్య క్యారక్టర్ కి ఇన్స్పిరేషన్ అని గతంలో నేను కూడా జస్టిస్ చంద్రు గురించి గొప్పగా ఊహించుకున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ లో న్యాయ వ్యవస్థ మీద, ఇక్కడ జరుగుతున్న పరిస్థితితులు ఏమి తెలియకుండా, ఒక చిన్న తలపాగా పెట్టి, ఒక శాలువా కప్పగానే, వారు మాట్లాడిన మాటలు వింటే నవ్వు వచ్చింది, తరువాత బాధ అనిపించింది. "
"రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, అందులో కొన్ని చట్టాలు ఉంటాయి. హైకోర్టు కానీ, సుప్రీం కోర్టు కానీ, ముఖ్యంగా చూసేది రాజ్యాంగం చూసే తీర్పులు ఇస్తాయి. అయితే ఆయన మాత్రం, ఇవీమీ తెలియనట్టు, అవగాహన లేకుండా మాట్లాడారు. మాట్లాడించినట్టు అల్లా, ఒక కేజిడ్ ప్యారెట్ లాగా, ఆయన స్థాయిని ఆయన తగ్గించుకుని మాట్లాడినందుకు ఆయన్ను చూసి బాధ పడాల్సి వస్తుంది. మరి అలాగే, వారిని ఈ స్థాయిలో, ఇంత కిందకు దిగజార్చిన, మా యువజన శ్రామిక రైతు పార్టీని, ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి, వ్యక్తిగతంగా హాట్సాఫ్. చూద్దాం న్యాయ వ్యవస్థను ఇప్పుడు వేరే వారితో తిట్టించారు. వారిని జైల్లో పెట్టించారు. ఇప్పుడు ఒక న్యాయ మూర్తితోనే తిట్టిస్తే, అదీ ఒక దళిత జడ్జి గారితో తిట్టిస్తే, ఇబ్బంది ఉండదని చెప్పి, మీరు పన్నిన ఈ పన్నాగానికి మిమ్మల్ని అభినందిస్తూ, ఆ ఉచ్చులో చిక్కుకున్న వారిని చూసి బాధ పడుతూ, ఏది నిజం అనేది ప్రజలే నిర్ణయించుకుంటారు." అని రఘురామరాజు కౌంటర్ ఇచ్చారు.