యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ, రఘురామకృష్ణం రాజు, అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం కంటే, ఎక్కువగా వార్తల్లో ఉంటూ ఉంటారు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఎదుటి వాడికి కౌంటర్ ఇవ్వటానికి కూడా అలోచించాల్సిందే. ఆయన వేసే ఎత్తుగడలు అంత స్ట్రాంగ్ గా ఉంటాయి. ప్రతి వారం రాజధాని రచ్చబండ పేరుతో ప్రజల ముందుకు వచ్చి తన వాణి వినిపించే రఘురామరాజు ట్రెండ్ మార్చారు. తన పై అక్రమంగా సిబిఐ కేసులు పెడుతున్నారని గ్రహించి, ఎదురు దాడికి సిద్ధమయ్యారు. గత వారం, సిబిఐ కోర్టులో , జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ పిటీషన్ దాఖలు చేసారు. ఏడాదిన్నరగా జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకపోయినా, ఆయన్ను ఎందుకు కోర్టు పట్టించుకోవటం లేదు అనే అనుమానం వ్యక్తం చేసారు. సిబిఐ కూడా ఎందుకు వదిలేస్తుంది అంటూ, ప్రశ్నిస్తూ, ఈ విషయం పై తేలే వరకు వదిలి పెట్టను అని, జగన్ బెయిల్ ను రద్దు చేయాలి అంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఈ పిటీషన్ దాఖలు చేసిన తరువాత, తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అంటూ, రఘురామరాజు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. అంతే కాదు, తనను లేపెయటానికి, జగన్ మోహన్ రెడ్డి, కడప నుంచి వచ్చిన కొంత మందితో సమావేశం అయ్యారు అంటూ, తీవ్రమైన ఆరోపణలు చేసారు. ఆరోపణలు మాత్రమే కాదు, ఇదే విషయం పై ప్రధాని మోడీకి కూడా లేఖ రాసారు. తన పై, తన ముఖ్యమంత్రి కక్ష కట్టారని, కడప నుంచి కొంత మందిని రంగంలోకి దించారని, ఆ లేఖలో తెలిపారు.

rrr 09042021 2

ఇప్పటికే తనకు వై క్యాటగిరీ సెక్యూరిటీ ఉందని, ఈ సెక్యూరిటీ హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఉందని, ఢిల్లీలో కూడా తనకు ఈ సెక్యూరిటీ ఇవ్వాలి అంటూ, రఘురామ రాజు, ప్రధాని మోడీకి లేఖ రాసారు. లేఖ రాసిన వెంటనే, కేంద్రం రియాక్ట్ అయ్యారు. ఢిల్లీలో కూడా రఘురామరాజు కు సెక్యూరిటీ ఇస్తూ, ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో రఘురామరాజు సంతోషం వ్యక్తం చేసారు. అంతే కాదు, తనకు ఢిల్లీ లెవెల్ లో ఉన్న పలుకుబడి ఏమిటో చూపించారు కూడా. అయితే సిబిఐ పిటీషన్ గురించి ఈ రోజు రఘురామరాజు మీడియాతో మాట్లాడారు. తాను వేసిన సిబిఐ పిటీషన్ రిజెక్ట్ అయ్యిందని మా వాళ్ళు సంతోష పడుతున్నారని, కానీ మరిన్ని డాక్యుమెంట్లు కోర్టు అడిగితే, ఈ రోజు అవన్నీ తీసుకుని కోర్టుకు వెళ్తే, జడ్జి గారు అందుబాటులో లేరని, సోమవారం సెలవు కాకపొతే, సోమవారం కానీ, లేకపోతే వరుస సెలవులు ఉన్నాయి కాబట్టి, మళ్ళీ గురువారం కానీ, ఈ కేసు సిబిఐ కోర్టులో ఫైల్ అవుతుందని, ఎవరూ కంగారు పడద్దు అంటూ, రఘురామరాజు వీడియో సందేశం ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read