జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన అఫిడవిట్ చూస్తే ఎవరైనా అవాక్కవాల్సిందే. రఘురామకృష్ణం రాజుతో పాటుగా, ఏబీఎన్, టీవీ5 చానల్స్ పై, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాజద్రోహం కేసు పెట్టిన సంగతి తెలిసిందే. దీని పై టీవీ5, ఏబీఎన్ యాజమాన్యాలు సుప్రీం కోర్టుకు వెళ్ళాయి. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం, ఈ కేసుని విచారణ చేసి, పిటీషనర్ల పై ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడవద్దని చెప్తూ, ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని కోరుతూ, కేసుని వాయిదా వేసింది. అయితే ఇప్పుడు ఈ పిటీషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా టీవీ5 చైర్మన్ నుంచి రఘరామకృష్ణంరాజుకి పదిలక్షల యూరోలు వచ్చాయట. అంటే దాదాపుగా రూ.8.8 కోట్లు. టీవీ5 వాళ్ళు డబ్బులు ఇస్తే, దానికి ప్రతిఫలంగా క్విడ్ ప్రో కోగా రఘురామకృష్ణం రాజు, ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు అంట. అయితే ఇక్కడ రఘురామకృష్ణం రాజు ఆర్దిక పరిస్థితి తెలిసిన ఎవరైనా, ఇలా రూ.8 కోట్లు కోసం రఘురామరాజు, ఇలా చేస్తారు అని చెప్తే ఎవరైనా నమ్ముతారా ? ఆయన స్వభావం తెలిసిన వారు, ఆయన ఎవరికీ లొంగరని, ఎవరి మాట వినరని చెప్తూ ఉంటారు. గతంలో జగన్ కేసులో, అప్పటి సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణను ఫోన్ లిస్టు బయట పెట్టి, జగన్ కు మంచి చేసిన విషయం గుర్తు చేస్తున్నారు.
ఇక పిటీషన్ లో మరో అంశాలు చుస్తే, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 చానల్స్ తో పాటుగా, చంద్రబాబు, లోకేష్ కూడా ఈ కుట్రలో ఉన్నారని అఫిడవిట్ లో తెలిపారు. అందరూ కూడగట్టుకుని ప్రభుత్వం ప్రతిష్టకు మచ్చ తీసుకుని రావటమే కాకుండా, కొన్ని వర్గాల మధ్య గొడవ కూడా పెట్టారట. తమ ప్రభుత్వానికి పత్రికా స్వేఛ్చ పై గౌరవం ఉందని, అయితే తమ పైనే కుట్రలు పన్నితే చూస్తూ ఊరుకోం అని అఫిడవిట్ లో తెలిపింది. రఘురామరాజు వీడియోలను పధకం ప్రకారమే వాళ్ళు ప్రసారం చేసారని తెలిపింది. చంద్రబాబు, లోకేష్, రఘురామరాజు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, అలాగే కొన్ని డాకుమెంట్స్ చూస్తే ఇదే విషయం అర్ధం అవుతుందని కోర్ట్ కు చెప్పింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద కుట్ర చేసారు అంటూ, జగన్ ప్రభుత్వం కోర్టుకు అఫిడవిట్ లో తెలిపింది. అంతే కాకుండా ప్రెస్ మీట్ అయిన తరువాత వివిధ చానల్స్ రిపోర్ట్ ల నుంచి, రఘురామరాజు ను అభినందిస్తూ, ప్రెస్ మీట్ బాగుంది, బాగా పెలించి, ఎక్కవు వ్యూస్ వచ్చాయి, పంచ్ అదిరింది అంటూ మెసేజ్ లు వచ్చాయని అఫిడవిట్ లో తెలిపింది.