బీజేపీ కేంద్ర కార్యాలయంలో, నర్సాపురం వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రత్యక్షం అయ్యి, అందరికీ షాక్ ఇచ్చారు. బీజేపీ కార్యాలయానికి వచ్చి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసారు. పార్లమెంటరీ కమిటీ చైర్మెన్ హోదాలో, జేపీ నడ్డాను కలిసినట్టు చెప్పారు. ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత ఏమి లేదని, రాజకీయ కోణంలో దీన్ని చూడవద్దు అని కోరారు. తనకు ఉదయం 10:30 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారని, అందుకే కలిసానని చెప్పారు. అయితే బీజేపీ కేంద్ర కార్యాలయానికి, వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎంపీ రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల కాలంలో, రఘురామకృష్ణంరాజు పార్టీకి సంబంధించి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటూ, స్పీకర్ కు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వెయ్యాలని కోరింది. అయితే ఈ రోజు వైసిపీకి చెందిన నలుగురు సభ్యులు కూర్చునే సీట్లు మార్చారు, పార్లమెంట్ స్పీకర్. ఇందులో రఘురామకృష్ణం రాజు స్థానం కూడా ఉండటం, గమనార్హం..
అయితే రఘురామకృష్ణం రాజు మాత్రం, పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మెన్ గా, జరుగుతున్న తీరు, మరీ ముఖ్యంగా కోవిడ్ సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై, వీటి అన్నిటి పై చర్చించేందుకు, సీనియర్ పార్లిమెంట్ నాయకులను కలుస్తున్నా అని, సీనియర్ ఎంపీగా ఉన్న నడ్డాను ఆ క్రమంలోనే కలవాలని నిర్ణయం తీసుకోవటంతో, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వటంతో, వచ్చానని చెప్పారు. ఆయన అభిప్రాయాల కోసం వచ్చానని, దీనికి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్తున్నారు. అయితే రఘురామకృష్ణం రాజు ఎపిసోడ్ గత నెల రోజులుగా నడుస్తూ ఉన్న తరుణంలో, ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే ఆయన పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా బీజేపీ పార్టీ అధ్యక్షుడిని కలవటంతో, రఘురామకృష్ణం రాజు, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. మరో పక్క, ఇప్పటికే, రఘరామకృష్ణం రాజు అనర్హత అంశం, స్పీకర్ పరిశీలనలో ఉంది.