ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి ఏపీ సీఐడీ పోలీసులు వచ్చారు. రఘురామకు నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో నమోదైన రాజద్రోహం కేసుల దర్యాప్తులోనే వచ్చినట్టు తెలుస్తుంది. 17న హాజరయ్యేందుకు నోటీసులు ఇచ్చారు. అయితే ఈ అరెస్ట్ పైన రఘురామరాజు స్పందించారు. ఆయన ఏమన్నారు అంటే, "సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలోని టీం ఈ రోజు వచ్చింది. గతంలో నా మీద నమోదు చేసిన రాజద్రోహం, దేశ ద్రోహం కేసు విషయంలో,, మరిన్ని వివరాలు ఇవ్వటానికి రమ్మన్నారు. 17 వ తేదీన రమ్మన్నారు. నిన్న మా జిల్లా కలెక్టర్, ఎస్పీ గారికి, మా జిల్లాకు వస్తున్నా అని, సెక్యూరిటీ చూసుకోమని చెప్పాను. పోలీసులు అందరూ ఒక్కటే కాబట్టి, వాళ్ళు వీళ్ళకు చెప్పారు అనుకుంటా, అందుకే వెంటనే వచ్చేసారు. 13, 14 రమ్మన్నారు. కానీ నేను హిందువుని కాబట్టి, పండగ రోజున రావాలి అంటే కుదరదు అని చెప్పాను. మా ముఖ్యమంత్రి గారికి, సునీల్ కుమార్ కి, మా పండగ గురించి తెలిసి ఉండదు. నా నియోజకవర్గానికి వస్తున్నా అంటే, వీరికి ఎందుకు బాధో అర్ధం కాలేదు. ఆ తేదీలు కుదరదు అంటే, 17 వ తేదీ రమ్మన్నారు. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రస్తుతం ఉన్న రూల్స్ కి, ప్రస్తుతం ఉన్న క-రో-నా, వర్చ్యువల్ ప్రోటోకాల్స్ కి అనుగుణంగా, అవి అనుసరిస్తూ అటెండ్ అవుతాను. "

rrr 12012022 2

"ఈ సునీల్ కుమార్, గతంలో నా సీఆర్పీఎఫ్ ని అక్కడకు రానివ్వకుండా చేసి, సునీల్ కుమార్ ఫోటో గ్రాఫర్ లాగా వచ్చాడు. ఇవన్నీ చెప్తాను. అయితే ప్రజలకు నేను చెప్పేది ఏమిటి అంటే, గతంలో నన్ను సిఐడి ఆఫీస్ కి తీసుకుని వెళ్లారు, అక్కడ ఎందుకు సిసి కెమెరాలు, ఒక్క రోజు ముందు ఎందుకు తీసేశారు ? అప్పటి వరకు ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఎందుకు మాయం అయ్యి, సునీల్ కుమార్, మరో నలుగురు ఆగంతుకులు ఎందుకు వచ్చారు ? నా సెక్యూరిటీ ఎందుకు ఒప్పుకోలేదు ? ఆ సమయంలో అక్కడ ఉన్న ఫోన్లు ఎవరెవారివి ? ఇవన్నీ సిబిఐ విచారణ కోరాను. సుప్రీం కోర్టులో ఇది ఉంది. ఇప్పుడు ఇది తేలకుండానే, మళ్ళీ ఈ ఉన్మాది సునీల్ కుమార్ నన్ను రమ్మంటే ఎలా వస్తాను ? ఆ వ్యక్తే నన్ను హింసిస్తున్నాడు అంటే, మళ్ళీ ఆ వ్యక్తే నన్ను రమ్మంటే ఎలా ? ఈ రావణ రాజ్యాన్ని నేను ప్రశ్నిస్తున్నా. రాజీనామా చేస్తాను, మళ్ళీ పోటీ చేస్తాను అంటే, భయపడి పోయారు అన్నారు. సరే అనే సమయం ఇచ్చా. ఇప్పుడు ఒక డూప్లికేట్ సియం ఉన్నాడు. ఎంపీ భరత్ అనే వాడు వాగుతున్నాడు. ఇప్పుడు ఈ సునీల్ కుమార్ అనే హిందూ వ్యతిరేకి, జగన్ అనే రఘురామ రాజు వ్యతిరేకి రమ్మన్నారు. చూద్దాం, ఏమి చేస్తారో" అని రఘురామరాజు అన్నారు

Advertisements

Advertisements

Latest Articles

Most Read