విశాఖపట్నంలో, ఏనాడో స్థిరపడిన నలందా కిషోర్ గారి మృతి ఎంతగానో కలిచి వేచిందని అన్నారు. ఆయనతో నాకు ఎప్పటి నుంచి సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. ఎవరో, అమెరికా నుంచి ఒక పోస్టింగ్ పెడితే, ఆ పోస్ట్ లో,ఎవరి పేరు లేకపోయినా, తమ మీదే అని భావించి, ఆయన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే, ఆ పోస్ట్ అందరూ చదివారు. నేను చదివాను, ఎవరి పేర్లు అందులో లేవు, మరి ఎందుకు బుజాలు తడుముకుని, సిఐడి పోలీసులు చేత ఎందుకు అరెస్ట్ చేపించారో తెలియదని అన్నారు. అయితే ఆయన వయసు 66 ఏళ్ళు, ఆరోగ్యం బాగోలేదు అని చెప్తున్నా సరే, విశాఖపట్నం నుంచి కర్నూల్ వరకు తీసుకు వచ్చారని అన్నారు. కర్నూల్ కోవిడ్ హబ్ అని తెలిసినా, కావాలనే అక్కడకు తీసుకు వెళ్ళారని అన్నారు. నాకు ఉన్న సమాచారం ప్రకారం, కరోనా పేషెంట్లు ఉన్న చోట, నలందా కిషోర్ ని చాలా సేపు కూర్చోబెట్టి, కరోనా టెస్టులు పేరుతో, తాత్సారం చేసారని చెప్పారు.

ఆయనకు అక్కడే కరోనా వచ్చినట్టుగా ఉందని చెప్తూ, ఆయనకు రెండు మూడు రోజులుగా నలతగా ఉండి, ఈ రోజు మరణించారని అన్నారు. అయన కరోనాతో మరణించారని, అక్కడ ఉన్న కామన్ ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు, మరి రిపోర్ట్స్ లో ఎలా ఇస్తారో చూడాలని అన్నారు. అయితే నేను మొహమాటం లేకుండా చెప్పాలని అనుకుంటున్నా అంటూ, రఘురామ రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది ముమ్మాటకీ పోలీస్ హత్యేనని అన్నారు. రాష్ట్రంలో రైట్ టు ఫ్రీడమ్ అఫ్ స్పీచ్ అనేది లేదని అన్నారు. చివరకు జీవించే హక్కు కూడా లేదని అనిపిస్తుందని అన్నారు. మాట్లాడే హక్కుని హరించినట్టు, జీవించే హక్కుని కూడా హరించారా అనే అనుమానం వస్తుందని అన్నారు. కరోనా పేషెంట్లు దగ్గర పెట్టారు అంటేనే, ఆ అనుమానం వస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న పోలీస్ వారి పై ఆక్షన్ తీసుకోవాలని అన్నారు. రంగనాయకమ్మ గారిని కర్నూల్ తీసుకుని వెళ్ళలేదు కాబట్టి, ఆమె బ్రతికిపోయిందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read