యువజన శ్రామిక రైతు పార్టీ ఎంపీ, రఘురామకృష్ణం రాజు, ఈ రోజు కూడా రాజధాని రచ్చబండ కార్యక్రమంలో మీడియా ముందుకు వచ్చారు. అయితే ప్రతిసారి కంటే, ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పై అందరూ ఆసక్తికరంగా ఎదురు చేసారు. నిన్న రఘురామకృష్ణం రాజు కంపెనీ పై సిబిఐ దాడులు జరిగాయి. అయితే ఇదే సమయంలో, ఆయన ఇళ్ళ పై కూడా సిబిఐ దాడులు జరిగాయి అంటూ, కొన్ని మీడియా ఛానెల్స్ ప్రసారం చేసాయి. అయితే వీటి పై నిన్న సాయంత్రమే స్పందించిన రఘురామకృష్ణం రాజు, అది బ్లూ మీడియా సృష్టి అని, తన ఇళ్ళ పై ఎలాంటి సిబిఐ దాడులు జరగలేదని, తాను ఇప్పుడు ఇంట్లో నుంచే మాట్లాడుతున్నా అని, ఈ విషయం పై అసలు ఏమి జరిగింది, దీని వెనుక ఎవరు ఉన్నారు, లాంటి మొత్తం వ్యవహారం పై రేపు మీడియాతో మాట్లాడతానని, అందరూ అది తప్పకుండా చూడండి అంటూ, చెప్పటంతో, ఈ రోజు ఆయన ఏమి చెప్తారా అనే ఆసక్తి నెలకొంది. అనుకున్నట్టె ఆయన కొన్ని సంచలన విషయాలు చెప్పారు. తన కంపెనీ తమిళనాడులో ఉందని, ఆ కంపెనీ కోసం 1500 కోట్ల అప్పు పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తెసుకున్నానని, అక్కడ ప్రభుత్వం విండ్ ఎనర్జీ తీసుకోకపోవటం, డబ్బులు ఇవ్వకపోవటంతో నష్టపోయానని, అప్పటి వరకు 700 కోట్లు కట్తానని, ఇంకా 800 కోట్ల దగ్గర ఇబ్బంది రావటంతో, వన్ టైం సెటిల్మెంట్ కు మాటలు నడుస్తున్నాయని అన్నారు.

అయితే ఈ లోపే మా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ, త్వరలో మంత్రి అవుదామని అనుకుంటున్న వ్యక్తీ, ఆ బ్యాంక్ వారితో మాట్లాడి ఈ కేసు మూవ్ చేసారని, అందుకే మొన్న మా ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చి, వారితో కూడా ప్రత్యేకంగా కలిసారని రఘురాం రాజు తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నన్ను ఏదో చేసానని అనుకుంటున్నారని, నాకు ఏమి అవ్వదని, విచారణలో అన్ని వివరాలు సిబిఐకి చెప్తానని, దానికి నన్నేదో వీళ్ళు చేసేసినట్టు, మోడీ గారు ఏదో వీళ్ళకు సహకరించినట్టు బిల్డ్ అప్ ఇస్తున్నారని, కానీ వీరికి అంత సీన్ లేదని అన్నారు. తాను ఎంక్వయిరీ చేస్తే, ప్రవీణ్ ప్రకాష్ అనే అధికారి, ఎవరు అయితే రాష్ట్ర యంత్రాంగం మొత్తం తన చేతిలో పెట్టుకుని ఉన్నాడో, ఆయన కేంద్రంలో ఫైనాన్స్ డిపార్టుమెంటు లో ఉన్న తన సహచర బ్యాచ్ మేట్ ద్వారా, ఈ కధ మొత్తం నడిపినట్టు తనకు తెలిసింది అంటూ, ఐఏఎస్ అధికారి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అలాగే తన పై తప్పుడు వార్తలు రాసిన సాక్షి పై పరువు నష్టం దావా వేద్దాం అనుకుంటే, రేపో మాపో జైలుకు పోయే వాళ్ళకు, ఈ శిక్ష ఎందుకులే అంటి మా లాయర్లు చెప్తే వదిలేసానని, మరో మూడు నాలుగు నెలల్లో, ముగ్గురు కీలక నాయకులు జైలుకు పోతారని రఘురాంరాజు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read