జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో, జగన్ బెయిల్ రద్దు చేయాలి అంటూ రఘురామరాజు సిబిఐ కోర్టులో వేసిన పిటిషన్‌ను, సీబీఐ కోర్టు కొట్టేసింది అంటూ సాక్షి మీడియా ట్వీట్ చేస్తూ, చేసిన హడావిడి పై, అదే సిబిఐ కోర్టులో మరో పిటిషన్ వేసి సాక్షి అంతు చూడాలి అంటూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నిర్ణయం తీసుకున్నారు. కోర్టు చెప్పకుండానే, ఆ తీర్పులు ముందుగానే సాక్షి మీడియాకు ఎలా తెలుస్తున్నాయి అంటూ, రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సాక్షి ముందుగానే వేసిన తీర్పు ట్వీట్ వెనుక పెద్ద కుట్ర ఉందని, దీని పై తక్షణమే విచారణ జరిపించాలని, తను సిబిఐ కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయిం తీసుకున్నట్టు రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ మేరకు రఘురామకృష్ణం రాజు, మీడియా సమావేశంలో మీడియాకు ఈ విషయాలు తెలిపారు. ఇప్పటికే సాక్షి తీర్పు వేసిన ట్వీట్ గురించి, న్యాయమూర్తి వద్దకు తీసుకుని వెళ్లామని, ఈ అంశం కోర్టు దృష్టిలో ఉందని, దీని పై ప్రత్యేకంగా ఒక పిటీషన్ కూడా వేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అయితే రఘురామకృష్ణం రాజు కనుక ఈ పిటీషన్ వేస్తే, ఇది మరో రకమైన చిరాకు అనే చెప్పాలి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఇటు సాక్షి మీడియాకే మరో ఇబ్బంది తప్పదు అంటూ, విశ్లేషకులు భావిస్తున్నారు.

rrr 28082021 2

ఇప్పటికే రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటీషన్ల పై వైసీపీ నేతలు తెగ టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి లేకున్నా, ఈ పిటీషన్లు మాత్రం, వైసీపీ పార్టీకి, జగన్, విజయసాయి రెడ్డి పరువుకి సంబంధించి ఇబ్బంది పెట్టే అంశాలు అనే చెప్పాలి. ఇక విజయసాయి రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్ళటం వెనుక కూడా రఘురామకృష్ణం రాజు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయాసాయి రెడ్డి విదేశాలకు వెళ్తే మళ్ళీ తిరిగి వేస్తారా అనే అనుమానం వ్యక్తం చేసారు. గతంలో తనను హేళన చేసారని, ఇప్పుడు వీళ్ళు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. తీర ప్రాంత అభివృద్ధి కోసం అంటూ బాలీ, మాల్దీవులకు విజయసాయి వెళ్ళటం పై, అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ పర్యటనకు సిబిఐ పర్మిషన్ ఇవ్వటం సమంజసంగా లేదని అన్నారు. దీని పై కూడా ఆయన ఏమైనా కోర్టుకు వెళ్తారో లేదో తేలియదు కానీ, జగన్, విజయసాయి రెడ్డి, వైసీపీ పార్టీని, రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో ఇబ్బందులు పెడుతూ, చుక్కలు చూపిస్తున్నారు అనటంలో సందేహమే లేదు

Advertisements

Advertisements

Latest Articles

Most Read