వైఎస్ఆర్ కాంగ్రెస పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు పేరు చెప్తే చాలు, వైసీపీ పార్టీకి హడల్. చంద్రబాబు కంటే ఎక్కువగా, రఘురామరాజు అంటేనే వైసీపీ భయపడుతూ ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు అనేకం ఆయన చెప్తూ, జగన్ గాలి తీసేస్తూ ఉంటారు. అంతే కాదు, ప్రతి రోజు రాజాధాని రచ్చబండ పేరుతో, ప్రభుత్వం చేస్తున్న దారుణాలు అన్నీ ప్రజలకు వివరిస్తూ ఉంటారు. ఆయన వాగ్ధాటి, చెప్పే విధానం, వెటకారంతో ప్రజలు ఆయన చెప్పే దానికి కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎన్ని ఒత్తిడులు తెచ్చినా రఘురామరాజు లొంగక పోవటంతో, చివరకు ఆయన పై రాజద్రోహం కేసు కూడా నమోదు చేసి, దారుణంగా అరెస్ట్ చేపించి, లోపల వేసారు. అంతేన, ఏకంగా సిఐడి ఆఫీస్ లో కొట్టించారు కూడా. ఒక ఎంపీని పోలీసులు కొట్టటం పై, అందరూ షాక్ కు గురయ్యారు. ఇక రఘురామరాజు సైలెంట్ అయిపోతారు అనుకుంటే, ఆయన మరింత వైలేంట్ గా తయారు అయ్యారు. దీంతో వైసీపీ పార్టీకి పిచ్చి పీక్స్ కు వెళ్తూ వచ్చింది. తాజాగా రఘురామకృష్ణం రాజు, మద్యం పైన ఆరోపణలు చేసారు. రాష్ట్రంలో కల్తీ సారా మద్యం, జే-బ్రాండ్స్ పైన అనేక ఆరోపణలు వచ్చాయి. జంగారెడ్డిగూడెంలో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. ఈ నేపధ్యంలోనే రఘురామరాజు కొన్ని ఆరోపణలు చేసారు.

rrr 24032022 2

ఏపిలో జే-బ్రాండ్స్ పై, ఆరోపణలు చేస్తూ, అవి తాగితే ప్రజాల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావితం చూపుతాయాని చెప్తూ, ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ల్యాబ్ లో, ఏపి జే-బ్రాండ్స్ ని టెస్టింగ్ చేపించారు. ఆ రిపోర్ట్ లు బయట పెట్టిన రఘురామరాజు, ఇవి తాగితే నెమ్మదిగా ప్రజలు ఎలా చనిపోతారో చెప్పారు. అయితే అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం, ఈ అంశం పై రఘురామరాజుకి నోటీసులు జారీ చేసింది. అయితే మళ్ళీ ఇదే అంశం పై, చెన్నై లోని మరో ల్యాబ్ కు కూడా రఘురామరాజు పంపిస్తున్నారని చెప్పటంతో, ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం, రఘురామరాజు పై పరువు నష్టం దావా వేస్తామని చెప్పింది. మద్యానికి కూడా పరువు ఏంటో వారికే తెలవాలి. రఘురామరాజు లొంగక పోవటంతో, ఆయన చేసే ప్రతి ఆరోపణ పైనా, ఆయా డిపార్టుమెంటుల చేత పరువు నష్టం దావాలు వేయించి, రఘురామరాజుని ఇబ్బందులు పెట్టాలని ప్రభుత్వం వ్యూహంగా మారింది. మరి ఈ వ్యూహం అయినా, ఫలిస్తుందో లేదో, రఘురామరాజు కంట్రోల్ లో ఉంటారో లేదో చూడాలి మరి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read