ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రస్తుతం, సికింద్రాబాద్ లోని ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఆయనకు తగిలిన గా-యా-లు బలంగా ఉండటంతో, ఆయన మరో మూడు నాలుగు రోజులు, అక్కడే ఉండాలని వైద్యులు చెప్పినట్టుగా ఎంపీ రఘురామరాజు న్యాయవాదులు అంటున్నారు. ఆయన గత అయుదు రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. ఇదే క్రమంలో ఆయనకు సుప్రీం కోర్టులో బెయిల్ కూడా వచ్చింది. అయితే ఆయనకు శుక్రవారమే బెయిల్ వచ్చినా, ఆయన ఇంకా ఆర్మీ హాస్పిటల్ లోనే ఉన్నారు. మరో పక్క సుప్రీం కోర్టు ఆదేశాలు ప్రకారం, ట్రయిల్ కోర్టులో షురుటీ ఇవ్వటానికి, రఘురామరాజు న్యాయవాదులు సిఐడి కోర్టులో పిటీషన్ మూవ్ చేసారు. అయితే పిటీషన్ మూవ్ చేసిన సమయంలో, సిఐడి కోర్టు న్యాయవాది ఎంపీ రఘురామరాజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందొ అడిగి తెలుసుకున్నారు. ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రఘురామకృష్ణంరాజు డిశ్చార్జ్ సమ్మరీ ఇవ్వాలని న్యాయవాది కోరారు. అయితే డిశ్చార్జ్ సమ్మరీ రావటానికి మరో మూడు నాలుగు రోజులు సమయం పట్టే అవకాసం ఉంది. ఎందుకంటే, ఆయనకు తగిలిన గా-యా-లు బలంగా ఉండటంతో, ఆయనకు మరో మూడు నాలుగు రోజులు వైద్యం అందించాలని, ఆర్మీ హాస్పిటల్ వైద్యులు చెపుతున్నారు.
దీంతో ఆర్మీ హాస్పిటల్ వైద్యులు నివేదిక వచ్చిన తరువాతే, అది చూపిస్తే కానీ, రఘురామరాజుకు బెయిల్ వచ్చే అవకాసం లేదని తెలుస్తుంది. అయితే ఆ నివేదిక వచ్చిన రోజే, షురుటీకి సంబందించిన పరిశీలిన కూడా అదే రోజు చేస్తామని, అదే రోజు రిలీజ్ ఆర్డర్ ఇస్తామని, కోర్టు చెప్పినట్టు, న్యాయవాదులు చెప్తున్నారు. దీంతో రఘురామ రాజు విడుదల మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటి వరకు అయన ఆర్మీ హాస్పిటల్ లోనే చికిత్స పొందనున్నారు. ఆరోగ్యానికి సంబందించిన విషయం కావటంతో, కుటుంబ సభ్యులు కూడా ఎలాంటి రిస్క్ తీసుకోకుండా, ఆయన ఆరోగ్యం మెరుగు పడే వరకు వైద్యం చేయమని చెప్పటంతో, ఆయన విడుదల మరింత ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆయన న్యాయవాదులు మీడియాతో చెప్పారు. ఆయనకు రీసెంట్ గానే, గుండె ఆపరేషన్ అవ్వటం, తరువాత సిఐడి ఆధీనంలో ఆయన కాళ్ళ పై ఫ్రాక్చర్ అయ్యేలా కొ-ట్ట-టం-తో, ఆయనకు మరింత వైద్యం అవసరం అయ్యింది.