నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు వేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై , ఈ రోజు సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. రఘురామకృష్ణం రాజుని, వెంటనే సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ హాస్పిటల్ కు తెసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయాలని, ట్రీట్మెంట్ ఇవ్వలేని ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు రఘురామకృష్ణం రాజు తరుపున సీనియర్ న్యాయవాదులు ముకుల్, ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. అలాగే ప్రభుత్వం తరుపున దేవ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వాదనలు ప్రరంభించిన ముకుల్, మా క్లైంట్ సిట్టింగ్ ఎంపీ అని, అధికార పార్టీ ఎంపీ అని, అయితే ఆయన ప్రభుత్వం చేస్తున్న తప్పుల పై విమర్శలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. గతంలోనే ఆయన తమ ప్రభుత్వం పైన నమ్మకం లేదు అంటూ, ఢిల్లీ హైకోర్టులో బద్రత కోసం పిటీషన్ వేసారని అన్నారు. ఆయనకు వై క్యాటగిరీ బద్రత కూడా ఇచ్చారని అన్నారు. అయితే ఈ సందర్భంలో కలుగు చేసుకున్న ప్రభుత్వం తరుపు న్యాయవాది తనకు సమయం కావాలని, ఈ కేసు నాకు నిన్నే వచ్చిందని, దీని స్టడీ చేయాలని, శుక్రవారం వాయిదా వేయాలని కోరారు. అయితే రఘురామరాజు తరుపు న్యాయవాది అందుకు ఒప్పుకోలేదు.

rrr sc 17052021 1

తమ క్లైంట్ కు బెయిల్ ఇచ్చి, ఒక న్యూట్రల్ హాస్పిటల్ లో కానీ, ఏదైనా ప్రైవేటు హాస్పిటల్ లో వైద్యం చేయాలనీ కోరారు. తన క్లైంట్ ను పోలీసులు కొట్టారని, ఇదే విషయం హైకోర్టుకు తెలుపుగా కోర్టు, మెడికల్ బోర్డు ఒకటి పెట్టినందని, వాళ్ళు ఏమి గాయాలు లేవని చెప్పారని, అయితే ఇక్కడ ఉన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రభావతి భర్త, వైసీపీ పార్టీ లీగల్ సెల్ లో ఒక మెంబెర్ అని కోర్టుకు తెలిపారు. అందుకే ఆయన్ను ఆర్మీ హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలని కోరారు. అయితే ప్రభుత్వం తరుపు న్యాయవాది మా దగ్గర ఎయిమ్స్ ఉందని చెప్పగా, అది న్యూట్రల్ కాదని కేంద్ర పరిధిలోనిది అని, ఆర్మీ హాస్పిటల్ అయితే న్యూట్రల్ గ ఉంటుందని వాదించారు. దీంతో కోర్టు ఆర్మీ హాస్పిటల్ దగ్గరలో ఎక్కడ ఉందని కోరగా, హైదరాబాద్ లో ఉందని, వైజాగ్ లో మరింత దూరం అని చెప్పారు. దీనికి స్పందించిన కోర్టు గంట పాటు విచారణ వాయిదా వేసింది. చివరకు సికింద్రాబాద్ లో ఉన్న ఆర్మీ హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలని ఆదేశాలు ఇచ్చింది. జ్యుడీషయల్ అధికారిని నియమిస్తామని, ఆర్మీ హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళాలని, తమకు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని, కేసుని 21కి వాయిదా వేసింది. బెయిల్ పిటీషన్ శుక్రవారం వింటామని చెప్పింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read