వైసిపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు, జగన్, విజయసాయి రెడ్డిలను వదలి పెట్టటం లేదు. రఘురామకృష్ణం రాజు, ప్రభుత్వంలో జరిగే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలును వ్యతిరేకిస్తూ ప్రతి రోజు చాకిరేవు పెడుతూ ఉండటంతో, జగన్, విజయసాయి రెడ్డి ఆయన్ను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. అరెస్ట్ చేపించి, కస్టడీలో కొట్టించి, నానా రభసా చేసారు. అప్పటికే రఘురామరాజు కంపెనీని దెబ్బ కొట్టే చర్యలు కూడా ప్రారంభించారు. వీటి అన్నిటి నేపధ్యంలో, రఘురామరాజు కూడా, వీలు కుదిరిన ప్రతి సారి, ఆయన కూడా జగన్, విజయసాయి రెడ్డి లకు కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికే జగన్, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, ఆయన సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు పిటీషన్ వేయటం, అక్కడ కేసు పోవటంతో, హైకోర్టులో పోరాడటం కూడా తెలిసిందే. ఇప్పటికే రఘురామకృష్ణం రాజుతో, ప్రతి రోజు ఇబ్బందులు పడుతున్నారు విజయసాయి రెడ్డి. అయినా రఘురామరాజు మాత్రం వదిలి పెట్టటం లేదు. ఆయన స్థాయిలో ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. తాజాగా నిన్న, ఈ రోజు రఘురామరాజు, విజయసాయి రెడ్డి పై బాణాలు ఎక్కు పెట్టారు. రెండు రోజుల క్రితం సిబిఐ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సుభాష్ అనే ఒక న్యాయవాదిని నియమిస్తూ, ఉత్తర్వులు జారీ చేయటం వివాదాస్పదం అయ్యింది.

vsreddy 31102021 2

సుభాష్ అనే న్యాయవాది, విజయసాయి రెడ్డి, జగన్ లకు దగ్గర మనిషి అనే ప్రచారం జరిగింది. దీంతో ఇదే విషయం పై రఘురామరాజు వెంటనే సిబిఐ డైరెక్టర్ కు లేఖ రాసారు. జగన్, విజయసాయి రెడ్డి కేసుల్లో న్యాయవాదిగా ఉన్న సుభాష్ కాకుండా, వేరే వ్యక్తిని నియమించుకోవాలి అంటూ సిబిఐకి లేఖ రాసారు. అంతే కాదు, ఒక పక్క వివేక కేసు, న్యాయమూర్తులను దూషించిన కేసు, డాక్టర్ సుధాకర్ కేసు, ఇలా అనేక కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, తమకు అనుకూలమైన లాయర్ ని అక్కడ నియమించటం వెనుక ఎవరు హస్తం ఉందో తేల్చాలి అంటూ లేఖ రాసారు. ఇక రెండో అంశం, రుషికొండలో జరుగుతున్న విధ్వంసం పై, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు లేఖ రాసారు. రుషికొండలో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, వెంటనే విచారణ చేసి, దీని వెనుక ఉన్న వారి పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే రుషికొండ విధ్వంసం వెనుక విజయసాయి ఉన్నారు అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం మీద, విజయసాయి రెడ్డికి రెండు జర్క్ లు ఇచ్చారు రఘురామరాజు. మరి ఇవి ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read