ప్రముఖ సీనియర్ పాత్రికేయుడు, తెలకపల్లి రవి గారు అంటే తనకు ఎంతో గౌరవం అని చెప్పిన రఘురామ రాజు, ఒకప్పటి ప్రజాశక్తి ఎడిటర్ గా, ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తిగా, చాలా టీవీ చానల్స్ లో కనిపిస్తారని, ఆయనంటే గౌరవం అని, అయితే తాను నిన్న రాత్రి, తన మాటలకు చెలించిపోయినట్టుగా ఒక వీడియో చూసి, నేను చాలా బాధపడ్డానని రఘురామ రాజు అన్నారు. తెలకపల్లి రవి గారు చాలా మంచి ఆయన అని, అందులో సందేహం లేదని, ఆయనకు భాష అంటే కూడా చాలా ఇష్టం అని, సాహితీ స్రవంతి అని భాషకు సంబంధించి కూడా ఒకటి మొదలు పెట్టారని, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతృభాషని నిర్మూలించే కార్యక్రమం జరుగుతుంటే, సాహితీ స్రవంతి అధినేత , తమ ప్రభుత్వ విధానాన్ని ఎందుకు ఖండించలేదో తెలియదు, నేను అయితే చూడలేదని, ఆయన గొంతు ఎందుకో మూగబోయిందో అంటూ ప్రశ్నించారు. అయితే ఈ మధ్య తమ ముఖ్యమంత్రి గారి పని తీరు చూసి, ఈయనకు ప్రేమ ఎక్కువ అయినట్టు, ఆయన మాటల్లో తెలుస్తుందని అన్నారు. అయితే నిన్న నేను చెప్పింది, రేపు కోర్టు ధిక్కరణ రుజువు అయితే, రాజీనామా చేసే అవసరం రావచ్చు, అప్పుడు చాలా మంది నొచ్చుకుని, ఓదార్పు యాత్రకు రెడీ అవ్వాలని, ఎలా చేస్తారని తాను అంటే, రవి గారు దాని పై స్పందిస్తూ, ఎంతో బాధ పడ్డారని, ఆయన మొఖంలో ఆ బాధ కనిపించిందని అన్నారు.

అయితే ఇదే రవి గారికి, అమరావతి భూములు, రాజధానికి ఇచ్చి, ఇప్పుడు మూడు ముక్కలు చేస్తుంటే, రవి గారు ఎంత ప్రతిఘటించారో, ఎంత తల్లడిల్లారో కూడా తాను చూడలేదని రఘురామ రాజు అన్నారు. వంద మంది మనవోదేనతో పొతే, మీ కొలీగ్ అయిన సజ్జల, ఇప్పుడు ఎంతో పెద్ద వాడు అయిపోయాడు కానీ, గతంలో మీలాగే వార్తలు రాసుకునే వాడు అని, ఆయన అమరావతి రైతులని హేళన చేస్తుంటే, చావులను హేళన చేస్తుంటే, ఏమైపోయారు రవి గారు, మీ హృదయ వేదన ఏమైంది ? ఎందుకు మాట్లాడలేదు, మీ దయా హృదయం ఏమైంది అని ప్రశ్నించారు. మా ముఖ్యమంత్రి అంటే మీకు ప్రేమ కాబట్టి బాధ కలిగి ఉండవచ్చు కానీ, రైతులను అవహేళన చేసినప్పుడు కూడా స్పందించి ఉంటే బాగుండేది అని అన్నారు. అయితే రఘురామ రాజు వ్యాఖ్యల పై , తెలకపల్లి రవి స్పందించారు. తనకు ముఖ్యమంత్రి అంటే ఏమి ప్రేమ లేదని, రఘురామ రాజు మాట్లడిన వ్యాఖ్యల పై అభ్యంతరం చెప్పానని, దానికి కట్టుబడి ఉన్నానని అన్నారు. అలాగే తాను తెలుగు భాష పై, రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై స్పందించానని, అలాగే అమరావతి రైతులకు ఈ ప్రభుత్వం చేసిన అన్యాయం పై కూడా తాను స్పందించానని, తెలుసుకుని రఘరామరాజు స్పందించాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read