వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు మాట్లాడే ప్రతి మాట, వైసీపీ పార్టీకి తూటాలు లాగా దిగుతూ ఉంటుంది. ఆయన చేసే ప్రతి ఆక్షన్ వైసిపీ పెద్దలను ఇరుకున పెడుతూ ఉంటుంది. దీంతో భరించ లేక రఘురామకృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని కూడా వైసిపీ ప్రయత్నాలు చేసినా, ఏడాది కాలంగా అనేక సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఢిల్లీ వెళ్ళినా, ఆయన పై ఎలాంటి అనర్హత వేటు వేయించలేక పోయారు. అనర్హత వేటు వేయాలని పై చేయి సాధించాలని ఎంత ప్రయత్నం చేసినా కుదరదు లేదు. తరువాత రఘురామకృష్ణం రాజుని అరెస్ట్ చేపించి, ఆయన కాళ్ళ పై కొట్టారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతకు ముందే రఘురామకృష్ణం రాజు, జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, ఆయన కోర్టులో కూడా పోరాటం చేస్తున్నారు. ఈ విధంగా, అనేక విధాలుగా వైసీపీని రఘురామకృష్ణం రాజు చిరాకు పెడుతూ వస్తున్నారు. ఆయన నోరు మూపించాలని వైసీపీ నేతలు ఎంత ప్రయత్నం చేసినా, వారి వల్ల కావటం లేదు. దీనికి ప్రధాన కారణం రఘురామకృష్ణం రాజు ఏమి చేసినా వితిన్ ది లా చేస్తున్నారు. దీంతో వైసీపీ పెద్దలు కూడా ఇక ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా వైసీపీ నేతలకు మరో జర్క్ ఇచ్చారు రఘురామకృష్ణం రాజు.
వైసీపీ సంస్థాగత ఎన్నికలను రఘురామకృష్ణం రాజు టార్గెట్ చేసారు. వైసీపీ పార్టీలో అధ్యక్ష ఎన్నికలు పెట్టాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలు పెడితే కనుక, జగన్ తో పాటుగా, తాను కూడా అధ్యక్ష ఎన్నికకు పోటీగా ఉంటాను అంటూ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. 2018 ప్లీనరీలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయని, పార్టీ బైలాస్ ప్రకారం, ప్రతి రెండేళ్ళకు ఎన్నికలు జరగాలని, కానీ క-రో-నా సాకుతో ఎన్నికలు వాయిదా వేసారని అన్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు పట్టుబట్టి, ఎన్నికల కమిషన్ తో గొడవపడి మరీ చేపించుకున్న మా పార్టీ వారు, అధ్యక్ష పదవికి మాత్రం ఎందుకు భయపడుతున్నారు అంటూ, రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. వెంటనే ఎన్నికలు పెడితే తాను కూడా అధ్యక్ష రేసులో జగన్ తో పోటీ పడతాను అని అన్నారు. అలాగే తన పై అనర్హత వేటుని పార్టీ వేయటం లేదని, తాను క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్త అని ప్రభుత్వం నమ్ముతుందని అన్నారు.