ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించి, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపధ్యంలో, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాన్సాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటున్నారు. అయితే ఈ నేపధ్యంలో, వైసీపీ నేత విజయసాయి రెడ్డి, హైకోర్టులో కేసు ఓడిపోయామనే ఉక్రోషంతో, అశోక్ గజపతి రాజు పై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు కూడా శ్రుతిమించి చేస్తూ ఉండటంతో, ఎబ్బెట్టుగా మారాయి. మరీ ముఖ్యంగా కండీషనల్ బెయిల్ పై ఉన్న వ్యక్తి అయిన విజయసాయి రెడ్డి, వేల ఎకరాలు దానం చేసిన అశోక్ గజపతి రాజుని దొంగ అని సంబోధించటం, నిన్ను జైలుకి పంపుతా అని చెప్పటం, ఇవన్నీ విద్దురంగా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే, విజయసాయి రెడ్డి వైఖరి పై, ఎంపీ రఘురామరాజు లేఖ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు. ఈ లేఖలో విజయసాయి రెడ్డిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని, విజయసాయి రెడ్డి భాషను కట్టడి చేయక పొతే, పార్టీకి తీరని నష్టం జరుగుతుంది అంటూ, విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. అంతే కాకుండా, మంత్రులను కూడా నియంత్రించాలని, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న మూడు నాలుగు జిల్లాల ప్రజలు భావోద్వేగంతో ఉన్నారని, మన నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అంటూ, జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖలో తెలిపారు.
2014లో అక్కడ ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయారని, ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, మళ్ళీ అవి పునరావృతం కాకుండా ఉండాలి అంటే, ముఖ్యంగా అశోక్ గజపతి రాజు, రాజ వంశం పై, వ్యక్తిగత దూషణలకు దిగటం ఏ విధంగానూ మంచిది కాదని, ఏదైనా ఉంటే న్యాయ పరంగా చట్ట పరంగా తేల్చుకోవాలని, వ్యక్తిగతంగా ఆయన దొంగ, ఆయనను జైలుకు పంపిస్తాం అని, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు అంటుంటే, అది పార్టీ పైన ప్రభావం పడుతుందని తెలిపారు. అశోక్ గజపతి రాజు పై ఎటువంటి ఆరోపణలు చేయటానికి, స్థానిక నేతలు కూడా భయపడతారని, అలాంటిది, ఆధారాలు ఏమి లేకుండా, ఇలాంటివి చేయటం మంచిది కాదని, ఉత్తరాంధ్ర ప్రజలు మళ్ళీ భావోద్వేగంలోకి వెళ్తే, మళ్ళీ 2014 రిపీట్ అవుతుందని జాగ్రత్త అంటూ, జగన్ మోహన్ రెడ్డిన హెచ్చరిస్తూ, వారిని కంట్రోల్ లో పెట్టుకోవాలని కోరారు. ముఖ్యంగా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారాలు, హైకోర్టు ఇచ్చిన తీర్పుని కూడా ఈ లేఖలో తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా, ఇలాంటి పనులు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని, విజయసాయి రెడ్డిని కట్టడి చేయాలని, రఘురామరాజు లేఖలో తెలిపారు.