ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాసారు. 2021 మే 14న, తన పుట్టిన రోజు నాడు,సిఐడి అరెస్ట్ చేయటం, తనని కస్టడీలోకి తీసుకోవటం, అలాగే కస్టడీలో తనను తీవ్రంగా కొట్టారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. ఏడాది కాలంగా ఈ కేసు కొనసాగుతూనే ఉందని, తనపై సీఐడీ విచారణ పేరుతో తన పై చేసిన దా-డి ఘటనపై త్వరితగతిన దర్యాప్తు జరపాలని రఘురామ రాజు తెలిపారు. మొత్తం అయుదు మంది తనను సిఐడి కస్టడీలో దా-డి చేసారని, అందులో ఒకడు సీఐడీ చీఫ్ సునీల్‍కుమార్ అని, ఆ లేఖలో రఘురామరాజు తెలిపారు. తన కేసు పైన, ప్రత్యేక బృందాన్ని పెట్టి, కొత్త దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, కేసు విచారణ స్పీడ్ గా అయ్యేలా చూడాలని ఆ లేఖలో పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి, చిత్ర హింసలు పెట్టిన విషయం గుర్తు చేసారు. ఇప్పటికే ఈ విషయం పైన తాను, పార్లమెంట్ స్పీకర్ కు ఫిర్యాదు చేసానని, అయితే లోక సభ నుంచి, ఇక్కడ డీజీపీ పూర్తి నివేదిక పంపించాలని కోరినా, ఎక్కడా స్పందన లేదని అన్నారు. నాటి డీజీపీ గౌతం సవాంగ్ కు, పార్లమెంట్ నుంచి లేఖ వచ్చిందని, తన పైన జరిగిన కస్టడీ టార్చర్ పైన, పూర్తి నివేదిక ఇవ్వాలని కోరినా, గౌతం సవాంగ్ స్పందించలేదని అన్నారు.
ఈ విషయం పైన పూర్తి పారదర్శకంగా నివేదిక తయారు చేసి, వెంటనే లోక్‍సభ స్పీకర్‍కు నివేదిక పంపించాలని, డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని, ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. తమరు కొత్తగా నియమించబడ్డారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తెసుకోవాలని, రఘురామరాజు కోరారు. తన విషయంలో, నిష్పక్షపాత దర్యాప్తు జరపాలి, సిఐడి సునీల్ కుమార్ వ్యవహార శైలి పైన విచారణ జరపాలని, ఈ మొత్తం నివేదికను వెంటనే లోకసభకు పంపాలని కోరారు. మరి కొత్తగా వచ్చిన డీజీపీ గారు ఎలా స్పందిస్తారో చూడాలి. గతంలో రఘురామరాజు మీద సిఐడి ఆఫీస్ లో దా-డి ఘటన పైన రఘురామరాజు, ప్రధానికి, హోం మంత్రికి, లోకసభ స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు పైన స్పందించిన లోకసభ స్పీకర్, వెంటనే తనకు నివేదిక పంపించాలని, అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ ని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం స్పందించ లేదు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన డీజీపీ గారు, రఘురామరాజు రాసిన లేఖ పైన ఏమి చేస్తారో చూడాలి మరి.