లోకసభ స్పీకర్ ఓం బిర్లాకు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు మరో లేఖ రాసారు. ఇందులో తన పై అనర్హత వేటు కోసం, వైసీపీ పెద్దలు వేస్తున్న ప్లాన్ ని బయట పెట్టారు. అనర్హత వేటు కోసం, అనేక పక్కదార్లు పడుతున్నారని అన్నారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాలు మేరకు, ఈ పనులు అన్నీ చేస్తున్నారని అన్నారు. తన పై కుట్రలు పన్ని, ఏదో ఒక విధంగా తనకు నష్టం చేయటానికి చూస్తున్నారని అన్నారు. ఒకే విధంగా లక్ష లేఖలు ముద్రించి, వాటి పై వారి మొబైల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు రాసి, తన పై అనర్హత వేటు వేసేలా, స్పీకర్ పై ఒత్తిడి తేవటానికి ప్రణాలికలు వేసారని, ఇదంతా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం జరుగుతుందని, తాడేపల్లిలో ఉన్న సాక్షి ప్రింటింగ్ ప్రెస్ లోనే, ఈ లేఖలు అన్నీ ప్రింట్ చేస్తున్నారని, తమకు సమాచారం అందటం, అవి మీకు చెప్పటం జరిగిందని అన్నారు. అయితే విషయం బయటకు పొక్కటంతో, ఆ ప్లాన్ ని వాయిదా వేసారని అన్నారు. అయితే ఇంకా తన పై వేరే విధంగా కుట్రలు పన్నుతున్నారు అంటూ, స్పీకర్ కు రాసిన లేఖలో రఘురామరాజు తెలిపారు. తన పై అనర్హత వేటు కోసం, అనేక పక్క దార్లు పడుతున్నారని, వాటి అన్నిటినీ కూడా మీరు పట్టించుకోవద్దు, అవి పరిగణలోకి తీసుకోవద్దు అంటూ ఆయన ఆ లేఖలో రాసారు.

spekaer 28062021 2

తన పై అనర్హత వేటు వేసేందుకు పన్నుతున్న కుట్రలను మీకు ఎప్పటికప్పుడు చెప్తానని అన్నారు. ఇవన్నీ మీకు చెప్పటానికి కారణం, మీరు వీటిని పరిగణలోకి తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే అని అన్నారు. ఇప్పటికే రఘురామ కృష్ణం రాజు పై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. గతంలో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ, వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి, స్పీకర్ ని కలిసి ఫిర్యాదు చేసారు. అయితే ఇప్పుడు మళ్ళీ లేఖ రాసి, గతంలో తాము ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించాలని కోరారు. అంతే కాకుండా వైసిపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా, లేఖ రాసారు. వెంటనే రఘురామరాజు పై వేటు వేయాలని, ఎందుకు లేటు అవుతుందో అర్ధం కావటం లేదని అన్నారు. అయితే, రఘురామరాజు మాత్రం, తాను పార్టీని, తమ నాయకుడిని ఎక్కడా ఒక్క మాట అనలేదని, కేవలం ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, తప్పుడు విధానాలు ప్రశ్నించానని, ఇవి చెప్పటం అనర్హత వేటుకు మార్గం కదాని, ఆ పిటీషన్ ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read