రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నిక ఈనెల 9వ తేదీన జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ, విపక్ష అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. మాములుగా అయితే, ఇలాంటి ఎన్నికలు అధికార పార్టీకి వన్ సైడ్ అయిపోతాయి. కాని, రెండు రోజుల క్రితం జరిగిన పార్లమెంట్‌ ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) సభ్యుల ఎన్నికలో, విపక్ష సభ్యులు అందరూ కలిసి బీజేపీ అభ్యర్ధిని ఓడించారు. అనూహ్యంగా అన్నాడీఎంకే కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ సభ్యుడు సీఎం రమేష్‌కు ఓటు వేశారు. దీంతో సీఎం రమేష్‌ రికార్డు స్థాయి ఓట్లతో గెలుపొందారు. ఇప్పుడు ఇదే, కమలనాథులకు ఏమాత్రం మింగుడుపడలేదు.

bjp 08082018 5

ఈ నేపథ్యంలో ఈనెల 9వ తేదీన జరుగనున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో అన్నాడీఎంకే సభ్యులు ఎవరికి ఓటు వేస్తారన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. పెద్దల సభలో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ లేదు. బీజేపీకి 75, కాంగ్రెస్‌కు 50, అన్నాడీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలకు 13 మంది చొప్పున, బిజూ జనతాదళ్‌కు 9 మంది, యునైటెడ్‌ జనతాదళ్‌, తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌కు 6 ఎంపీలు, జనతాదళ్‌, సీపీఎంకు 5 చొప్పున, ఎన్‌సీపీ, బీఎస్పీ, డీఎంకేలకు నలుగురు చొప్పున, శివసేన, అకాళీదళ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీలకు ముగ్గురు చొప్పున సభ్యులు ఉన్నారు. ఒక స్థానం ఖాళీగా ఉంది. మరికొన్ని చిన్నాచితక పార్టీలకు చెందిన సభ్యులతో పాటు నామినేటెడ్‌ సభ్యులు ఉన్నారు.

bjp 08082018 6

ప్రస్తుతానికి బీజేపీకి 93 మంది సభ్యుల మద్దతు ఉంది. విపక్ష పార్టీల బలం 116గా ఉంది. మరో 35 మంది సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీరిలో అన్నాడీఎంకే (13), బిజూ జనతాదళ్‌ (9), టీఆర్‌ఎస్‌ (6), శివసేన (3), పీపుల్స్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (2), వైసీపీ (2)ల పార్టీలకు చెందిన సభ్యులు ఉన్నారు. వీటిలో టీఆర్‌ఎస్‌, వైసీపీల సభ్యులు బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలుపనున్నారు. అలాగే, శివసేన, పీడీఎ్‌ఫలు కూడా బీజేపీకి అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 13 మంది సభ్యులు కలిగిన అన్నాడీఎంకే, 9 మంది సభ్యులు కలిగిన బీజేడీల నిర్ణయం ఇపుడు అత్యంత కీలకంగా మారింది.

bjp 08082018 7

బీజేపీ తరపున జేడీయూకు చెందిన హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, విపక్షాల తరుపున కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్‌ బరిలోకి దిగనున్నారు. అనూహ్యంగా ఎన్డీఏ మిత్రపక్షమైన శివసేన సైతం విపక్షాల అభ్యర్ధికే మద్దతు ఇచ్చింది. 13 మంది సభ్యులు కలిగిన అన్నాడీఎంకే సభ్యులు బీజేపీ అభ్యర్థికి మద్దతు, ఇప్పుడు బీజేపీకి కీలకం కానుంది. వీళ్ళు మద్దతు ఇస్తేనే, మిగతా పార్టీల వారిని లాగే అవకాసం ఉంటుంది. అయితే, తాజాగా ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం బంధువుకు కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎయిర్‌ అంబులెన్స్‌ సమకూర్చిన విషయం బహరింగం అవ్వటం, పన్నీర్‌సెల్వం పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చెయ్యటంతో, ఈ చర్యను అన్నాడీఎంకే నేతలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే మొన్న పీఏసీ ఎన్నికలో, బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసారు. ఓపీఎస్‌కు జరిగిన అవమానానికి అమిత్‌ షా లేదా నిర్మలా సీతామాన్‌లలో ఎవరో ఒకరు బహిరంగంగా స్పందిస్తేనే రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అన్నాడీఎంకే మద్దతు ఇస్తాం అంటుంది. మరి, చివరకు, ఇది ఏ మలుపు తీసుకుంటుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read