ఆయన పేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మొన్నటి వరకు ఐపిఎస్ ఆఫీసర్ గా తెలంగాణలో పని చేసారు. దళితుల కోసం అని, ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. మాయావతికి చెందిన బీఎస్పీ పార్టీలో చేరారు. ప్రస్తుతం ఈయన తెలంగాణాలో ఒక సెన్సేషన్. ఉద్యోగానికి రాజీనామా చేసిన కొత్తలో, తెలంగాణా రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపెస్తారాని అందరూ భావించారు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించలేక పోయినా, ఒక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిన్న ఏబిఎస్ ఛానల్ లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన నేపధ్యంలో, చిన్నప్పుడు పడిన అవమానాలు, తరువాత ఆయన కెరీర్, ఇప్పటి రాజకీయ పరిస్థితితులు, కేసీఆర్ పరిపాలన, ప్రస్తుతం తెలంగాణా ఎదుర్కుంటున్న ఇబ్బందులు, ఆయన రాజకీయ ప్రస్తానం ఇలా అనేక అంశాల పై ఆయన, నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో తన భావాలను పంచుకున్నారు. ఈ సందర్భంగానే ఆయన గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండగా జరిగిన, అప్పటి తెలుగుదేశం పార్టీ కీలక నేత, పరిటాల రవి హ-త్య గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వగానే, టిడిపి నాయకులను వరుస పెట్టి చం-పు-కుం-టూ వచ్చారు. ఆ క్రమంలోనే పరిటాల రవి కూడా చనిపోయారు. ఆయన హ-త్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని, అప్పట్లో అందరికీ తెలిసిందే. అయితే అప్పట్లో పరిటాల రవి హ-త్య జరిగిన సందర్భంలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అనంతపురం ఎస్పీగా ఉన్నారు. అప్పట్లో ఈయన పై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం పైన, నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. పరిటాల రవి పై అటాక్ జరగబోతుందని అందరికీ తెలుసు, మేము కూడా హెచ్చరించాం, పరిటాల రవి తన ప్రాణానికి ముప్పు ఉందని, జైల్లో కుట్ర పన్నుతున్నారని, నాకు కూడా ఫిర్యాదు చేసారు, నేను ఆ లేఖను ప్రభుత్వానికి ఇచ్చాను. ఎస్పీగా అది నా బాధ్యత. కాని దాని పై నిర్ణయం తీసుకోవాల్సింది అప్పటి ప్రభుత్వం" అని ప్రవీణ్ కుమార్ అన్నారు. అంటే అప్పటి ప్రభుత్వం, పరిటాల రవి విజ్ఞప్తిని పట్టించుకోలేదని చెప్పకనే చెప్పారు.