ఆర్టీసీ ఏండీగా ఉన్నా తనను, బదిలీ చెయ్యటం పై, మాదిరెడ్డి ప్రతాప్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన ట్రాన్స్ఫర్ ని స్వాగిస్తున్నా అంటూనే, ఆ నిర్ణయాన్ని, జగన్ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నా అని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సియంగా ఉన్నప్పుడు, తానూ ౫ ఏళ్ళ పాటు ఐటి శాఖ కార్యదర్శిగా పని చేసానని గుర్తు చేసారు. అప్పట్లో కొందరు అధికారులు పంపిన ఫైల్స్ పై విచారణ జరిగినా, తన పై మాత్రం ఎలాంటి అభియోగాలు రాలేదని, అది తన నిజాయతీ అని అన్నారు. ఆయన మాట్లాడుతూ "కొంత మంది నా ఇంటెగ్రిటీ మీద కూడా డౌట్స్ వ్యక్తం చేసారు. అది చాలా బధాకారం. నా ఇంటెగ్రిటీ అనేది తెరిచిన పుస్తకం. రాజశేఖర్ రెడ్డి దగ్గర, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి సెక్రటరీగా, ఇంచార్జ్ ఇండస్ట్రీ, ఐటి సబ్జెక్ట్ లు చూస్తూ ఉన్నాను. అకస్మాత్తుగా, ఆయన చనిపోవటంతో, రాష్ట్రం రెండు ముక్కలు అయిపొయిందనే విషయం అందరికీ తెలుసు. ఆయన ఉంటే విభజన జరిగేది కాదు. ప్రస్తుత ముఖ్యమంత్రి పై, అప్పట్లో సిబిఐ ఎంక్వయిరీ వేసారు. ఆ నాటి ముఖ్యమంత్రి ఆఫీస్ లో పని చేసిన ఆఫీసర్లను, సిబిఐ వారం రోజుల పాటు, ఎంక్వయిరీ చేసింది. "

"వాళ్ళు డిస్పోజ్ చేసిన ప్రతి ఫైల్ ని ఇంటరాగెట్ చేసారు. వాళ్ళు ఇంటరాగేట్ చేసిన వారిలో కానీ, సిబిఐ అనుమానించిన వారిలో కానీ, ఒక్కరు మాత్రం లేరు. ఆ వ్యక్తి మాదిరెడ్డి ప్రతాప్ అని సగర్వంగా చెప్తున్నా. అందరూ ఫైల్ పై నోట్ అప్రోవ్డ్, నాట్ అప్రోవ్ అని రాస్తారు. నేను మాత్రం, మొత్తం కారణం రాస్తాను. స్పీకింగ్ నోట్స్ రాస్తాను. 26 ఏళ్ళ కెరీర్ లో అనేక ఉన్నత పదవులు అదిరోహించాను. ఎన్నో ప్రాజెక్ట్ లు తెచ్చాను. ఈ రోజుకి కూడా, హైదరాబాద్ లో కానీ, ఎక్కడా కాని, ఒక్క అపార్ట్ మెంట్ కూడా నాకు లేదు. అది నా ఇంటెగ్రిటీ. అలాంటిది ఒక్క రూపాయి కూడా అవినీతి లేని చోట, నా పై విమర్శలు చేసారు. నేను కూడా ముఖ్యమంత్రి ఆఫీస్ లో పని చేసాను, నా బదిలీ అనేది ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నా, వాళ్ళ ఆర్డర్స్ ఫాలో అవ్వటమే, నేను చెయ్యగలిగింది. నేను నా బదిలినీ ప్రశ్నించలేదు కదా" అంటూ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. ఐఏఎస్ వర్గాల్లో, ఇది సంచలనంగా మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read