ఏపిఎస్ ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో పని చేస్తున్న వారికి షాక్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. ఒకేసారి 6 వేల మందిని తొలగిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకోవటంతో, లబోదిబో మంటున్నారు కార్మికులు. నేటి నుంచి విధులకు హాజరుకావద్దని డిపో మేనేజర్ల మౌఖిక ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,270 మంది ఉద్యోగులకు ఏప్రిల్ జీతాలు నిలుపుదల చేసినట్టు సమాచారం. ఆర్టీసీ ఎండీ ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు, రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించినట్టు అధికారరులు చెప్తున్నారు. అయితే ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏప్రిల్ నెల వేతనాలు కూడా అందలేదని తెలుస్తుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు పై, కార్మిక సంఘాలు భగ్గు మంటున్నాయి. ఆర్టీసీ తీరును ఖండిస్తూ, కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేసాయి. తొలగించిన అవుట్ సోర్సింగ్ కార్మికులు అందరినీ వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే ఆర్టీసీ వర్గాలు మాత్రం, దీని పై అధికారంగా స్పందించకపోయినా, మార్చి నెల 23 నుంచి లాక్ డౌన్ కారణంగా, ఆర్టీసీ బస్సులు బయట తిరిగే అవకాసం లేకపోవటంతో, భారీగా ఆర్టీసీకి నష్టాలు వచ్చాయని వాపోతున్నారు. ఆదాయం భారీగా పడిపోయిందని, వాపోతున్నారు. ఈ కారణంతోనే సంస్థలోనే రెగ్యులర్ ఉగ్యోగుల్లో ఖాళీలు ఉన్నా, వాటికి ఖాళీగానే ఉంచాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఆర్టీసీకి వచ్చిన నష్టాలను పురించుకోవాలి అంటే, కొన్ని కొన్ని ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉందని, అందులో భాగంగానే, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించనట్టు తెలుస్తుంది. అయితే దీని పై ఎక్కడా అధికారిక సమాచారం లేకపోయినా, మోఖిక ఆదేశాలు వచ్చాయని, ఉద్యోగులు వాపోతున్నారు.

ప్రభుత్వంలోకి ఆర్టీసీ విలీనం తరువాత, మాకు భరోసా ఉంటుందని అనుకున్నామని, కాని ఇలా మా పైనే, ప్రభుత్వం కత్తి కట్టటం దారుణం అని వాపోతున్నారు. ఇప్పటికే పోయిన నెల జీతం రాక ఇబ్బంది పడుతున్నాం అని, ఇప్పుడు కరోనా వల్ల మరింత ఇబ్బందుల్లో ఉంతే, ఇప్పుడు ఉద్యోగాలు నుంచి పీకేస్తే మా జీవనం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో ఉద్యోగం పొతే, తాము, తమ కుటుంబం ఎలా బ్రతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అని చెప్పి, ఇప్పుడు మా పొట్ట కొట్టారు అంటూ, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మానవతా దృక్పదంతో అలోచించి, తమను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read