కేసీఆర్ , జగన్ ల మధ్య స్నేహం ఎంత బలంగా ఉంటుందో అందరూ చూసారు. ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పిన మాటలు అయితే , కోటలు దాటాయి. తాము పోలవరం ప్రాజెక్ట్ పై వేసిన కేసులు అన్నీ వెనక్కు తీసుకుంటాం అన్నారు. ప్రత్యెక హోదా కోసం కలిసి పోరాటం చేస్తాం అన్నారు. ఎన్నికలు తరువాత రాయలసీమను రత్నాలు సీమ చేస్తాను అన్నారు. ఇక జగన్ గారు అయితే, రాయలసీమకు అన్యాయం చేసే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు కూడా వెళ్లి కొబ్బరికాయ కొట్టి వచ్చారు. ఇలా ఇద్దరూ ఒకరిని ఒకరు వాటేసుకుని, దావత్ లు ఇచ్చుకుని, రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి సమస్యలు ఉండవు అని చెప్పారు. ఇక ఎన్నికల తరువాత, మొత్తం సీన్ మారిపోయింది. కీలకమైన ఇరిగేషన్ రంగంలో తెలంగాణా నుంచి కొర్రీలు మొదలు అయ్యాయి. ఇక నీటి పంపకాలు విషయంలో కూడా గొడవలే. ఆస్తులు విభజనలో పురోగతి లేదు. ఇలా అన్ని విషయాలో తెలంగాణా కొర్రీలు పెడుతూనే ఉంది. అయితే ఎందుకో కానీ ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి మాత్రం, అనుకున్న స్థాయిలో ప్రతిఘటన లేదు. ప్రతి దానికి తెలంగాణా చెప్పిన దానికి లొంగిపోతున్నారు అనే అభిప్రాయం ఉంది. తాజాగా ఏపీఎస్ ఆర్టీసి, తెలంగాణా ఆర్టీసి మధ్య జరిగిన ఒప్పందం చూస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు ఎందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా చేసింది, ఎందుకు తెలంగాణా ప్రభుత్వానికి ఇంతలా లొంగిపోవాలి అనే ప్రశ్నకు సమాధానం లేదు.
రాష్ట్ర విభజన తరువాత, తెలంగాణా రాష్ట్రానికి ఆర్టీసి బస్సులు, అటు తెలంగాణా రాష్ట్రము నుంచి ఏపికి వచ్చేవి. అయితే ఎక్కువగా ఏపి బస్సులే తెలంగాణాలో తిరిగేవి. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ, హైదరాబాద్ కర్నూల్ రూట్ లో ఎక్కువగా ఏపి బస్సులు తిరిగేవి. భారీ లాభాలు ఈ రూట్ లో మన రాష్ట్ర ఆర్టీసికి వచ్చేది. అయితే లాక్ డౌన్ లో బస్సులు ఆగిపోవటంతో, మళ్ళీ బస్సులు తిప్పటానికి తెలంగాణా అడ్డు పడింది. దాదపుగా రెండు మూడు నెలల నుంచి చర్చలు జరుపుతున్నారు. మన మంత్రి పెర్ని నాని గారు అయితే, అదిగో ఇదిగో అని చెప్పుకుంటూ వచ్చారు. చివరకు తెలంగాణా చెప్పిన ప్రతి షరతుకు లొంగి, ఆర్టీసీకి దెబ్బ కొట్టారని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ఆరోపించారు. గతమలో టిడిపి హయంలో, తెలంగాణాకు తిప్పింది 2,65,367 కి.మీ అయితే, దాన్ని ఇప్పుడు 1,60,999 కి.మీ తగ్గించారని, అంటే 1,04,368 కి.మీ తగ్గించారని, అలాగే 250 బస్సులు నడిపే హక్కును ఏపి కోల్పోయిందని, దీని వల్ల రూ.273 కోట్ల వరకు మనకు నష్టం అని అన్నారు. ఇదే సమయంలో తెలంగాణా మాత్రం, మన రాష్ట్రంలో తిప్పే బస్సులు పెంచుకుందని, దాని వల్ల తెలంగాణాకు రూ.300 కోట్ల వరకు లాభం అని, ముఖ్యంగా విజయవాడ - హైదరబాద్ రూట్ లో, మొత్తం తెలంగాణా ఆధిపత్యమే ఉందని, అసలు ఇలా ఎందుకు లోనిపోయి, ఏపిఎస్ ఆర్టీసికి నష్టం చేస్తూ, తెలంగాణాకు లాభం చేసే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు, పట్టాభి.